Ramayana Collections: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ భారతీయ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. ,437.25 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇందులో భారతదేశం నుంచి వచ్చిన గ్రాస్ రూ. 947.25 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 490 కోట్లు వసూలయ్యాయి.
సోమవారం డ్రాప్

సెకండ్ వీకెండ్ లోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధించిన రామాయణం చిత్రం 12వ రోజు (సోమవారం) కాస్త నెమ్మదించింది. ఆదివారం రూ.75 కోట్లు రాబట్టిన ఈ మూవీ.. సోమవారం 57.3% డ్రాప్తో ఇండియాలో రూ.32 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా హిందీ వెర్షన్ దే పైచేయి. సోమవారం వసూళ్లలో హిందీ రూ.23.75 కోట్లు, మలయాళం రూ.2.85 కోట్లు, కన్నడ రూ.2 కోట్లు, తమిళం రూ.1.90 కోట్లు, తెలుగు రూ.1.50 కోట్లు రాబట్టాయి.
మంగళవారం నాటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సుమారు రూ.9.95 కోట్లు (5.30 లక్షల టిక్కెట్లు)గా నమోదయ్యాయి. బుకింగ్స్ లో 2D ఫార్మాట్ (రూ.4.81 కోట్లు) కంటే 3D వెర్షన్ (రూ.7.38 కోట్లు) కే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
టార్గెట్ ‘దంగల్’
'రామాయణం' సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసినప్పటికీ, నితీష్ తివారీ 2016లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ 'దంగల్' (రూ.2,070.30 కోట్లు) రికార్డును ఇంకా అందుకోలేకపోయింది. దంగల్ రికార్డుకు రామాయణం ఇంకా రూ.633 కోట్ల దూరంలో ఉంది. ఆ మార్క్ ను చేరుకోవాలంటే ప్రధానంగా చైనా మార్కెట్ పైనే ఆశలు పెట్టుకోవాలి.
ఎందుకంటే చైనాలో 'దంగల్' ఏకంగా రూ.1,305.29 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చైనా సెన్సార్ బోర్డు అనుమతి కోసం 'రామాయణం' సినిమాను పంపించారు. అన్నీ సవ్యంగా జరిగితే 2027 జనవరి - మార్చి మధ్యలో చైనాతో పాటు జపాన్, రష్యా, దక్షిణ కొరియా దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చైనాలో సెన్సార్ కష్టాలు
{{/usCountry}}ఎందుకంటే చైనాలో 'దంగల్' ఏకంగా రూ.1,305.29 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చైనా సెన్సార్ బోర్డు అనుమతి కోసం 'రామాయణం' సినిమాను పంపించారు. అన్నీ సవ్యంగా జరిగితే 2027 జనవరి - మార్చి మధ్యలో చైనాతో పాటు జపాన్, రష్యా, దక్షిణ కొరియా దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చైనాలో సెన్సార్ కష్టాలు
{{/usCountry}}చైనాలో రామాయణం సినిమాను విడుదల చేయడం అంత సులభం కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అక్కడి నిబంధనలకు అనుగుణంగా మార్చేందుకు ఈ సినిమా రన్ టైమ్ లో ఏకంగా 33 నిమిషాలు కట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'వీబో'లో ఈ సినిమాను 'రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ది ప్రిన్స్' అనే పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి 2020 గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనాలో హిందీ సినిమాల ప్రభావం బాగా తగ్గింది. ఇది కూడా ‘రామాయణం’మూవీకి ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.
చైనాలో వర్కౌట్ అవుతుందా?
దంగల్ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీ బ్రాండ్ నేమ్ తోనే చైనాలో 'రామాయణం' సినిమాను భారీ స్థాయిలో మార్కెటింగ్ చేస్తున్నారు. చైనాలో దంగల్ చిత్రం 10,000 స్క్రీన్లలో విడుదల కాగా, ‘రామాయణం’ మూవీని రికార్డు స్థాయిలో 20 వేల నుంచి 25 వేల స్క్రీన్లలో ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఫోగట్ ఫ్యామిలీలోని ఎమోషనల్ జర్నీ చైనీయులకు బాగా కనెక్ట్ అయింది. మరి మన పురాణాలైన రామాయణం, అందులోని రాముడు, సీత, రావణాసురుడు కథ చైనా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.