ఎన్నో నెలల నిరీక్షణకు తెరదించుతూ 'రామాయణ' మూవీ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ (ఏప్రిల్ 2) రామాయణ టీజర్ ను రిలీజ్ చేసింది. ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ ఆకట్టుకుంటోంది. అయితే సీతగా నటిస్తున్న సాయి పల్లవి, రావణుడి పాత్ర పోషిస్తున్న యశ్ ముఖాలు మాత్రం చూపించలేదు.
రామాయణ టీజర్

రామాయణ టీజర్ అదిరింది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా అయోధ్యలోకి ప్రవేశిస్తున్న దృశ్యం, ఆయనపై కురిపించిన పుష్పవర్షం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ టీజర్ చూస్తుంటే భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదో విజువల్ వండర్ కాబోతోందని స్పష్టమవుతోంది.
రాముడిగా రణ్‌బీర్
రామాయణ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. రామాయణం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గురువారం రిలీజ్ చేసిన టీజర్ లో రాముడిగా రణ్‌బీర్ ను పరిచయం చేశారు. అడవిలో ఆయన చేసే విన్యాసాలు, నేర్చుకునే విద్యలను టీజర్ లో చూపించారు.
సాయిపల్లవి ఎక్కడ?
అయితే రామాయణ టీజర్ లో సాయి పల్లవి, యశ్ ముఖాలు చూపించకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఓ సీన్ లో రాముడి వెనకాల లక్ష్మణుడు, సీత కూర్చున్నట్లు ఉంది. కానీ వాళ్ల ముఖాలు కనిపించలేదు.
రావణుడిగా యశ్
ఇక టీజర్ చివరలో రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ అతని ముఖాన్ని చూపించలేదు. సీత, యశ్ ముఖాలను రివీల్ చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే మరో ప్రత్యేక సందర్భం చూసుకుని వీళ్ల లుక్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నాడు.
జీవిత పాఠాలు
రామాయణ సినిమాను నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. దీనికి నమిత్ మల్హోత్రా నిర్మాత. రామాయణ టీజర్ సందర్భంగా నితేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి, చెడు మధ్య జరిగే యుద్ధమే కాకుండా, సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉండే బాధ్యతను కూడా చూపిస్తుందని వివరించారు.
{{/usCountry}}రామాయణ సినిమాను నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. దీనికి నమిత్ మల్హోత్రా నిర్మాత. రామాయణ టీజర్ సందర్భంగా నితేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి, చెడు మధ్య జరిగే యుద్ధమే కాకుండా, సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉండే బాధ్యతను కూడా చూపిస్తుందని వివరించారు.
{{/usCountry}}రాముడు తన కోరికల కంటే కర్తవ్యానికే ప్రాధాన్యత ఇచ్చి త్యాగనిరతితో జీవించాడని నమిత్ కొనియాడారు. రాముడి పాత్ర పోషించడం కాదు ఆయన నుండి జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వచ్చానని రణ్‌బీర్ ఎమోషనల్ అవుతూ చెప్పాడు.
4000 కోట్ల బడ్జెట్
రామాయణ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాల కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం, ఇది భారతీయ సినిమాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.