Ramayana Trailer Reactions: ఇండియన్ సినీ హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా ‘రామాయణ’. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 'రామాయణ' (Ramayana) ట్రైలర్ ఇవాళ (జూలై 30) రిలీజ్ అయింది. అధికారిక ట్రైలర్‌ను గురువారం తెల్లవారుజామున 4:15 గంటలకు పవిత్రమైన బ్రహ్మముహూర్తాన మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ పై మిక్స్ డ్ రియాక్షన్లు వస్తున్నాయి.
4000 కోట్ల సినిమానా?

రెండు పార్టులుగా వస్తున్న ‘రామాయణ’ సినిమా కోసం ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్రాంఛైజీ ఇది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘నిజంగా చెప్తున్నా ఇప్పటివరకైతే ఇది రూ.4 వేల కోట్ల సినిమాగా అనిపించలేదు’’ అని ఓ ఎక్స్ యూజర్ విమర్శించాడు.
ఇదేం డైలాగ్ డెలివరీ?
రణ్‌బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ పై డివైడెడ్ టాక్ వినిపిస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ చూపించిన శాంతం, నిగ్రహం బాగున్నాయని ఒక వర్గం ఫ్యాన్స్ అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన డైలాగ్ డెలివరీలో 'యే జవానీ హై దీవానీ' నాటి షేడ్స్ కనిపిస్తున్నాయని, రాముడి పాత్రకు ఉండాల్సిన గంభీరత తగ్గిందని ట్రోల్స్ చేస్తున్నారు.
వారణాసిలోని ఒక్క సీన్
రామాయణ ట్రైలర్ ను వారణాసి టీజర్ గ్లింప్స్ తో పోలుస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ‘‘రామాయణ ట్రైలర్ ఓ లేజీ ఏఐ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. అందులో నిజంగా ఏం లేదు. వారణాసిలోని ఈ సీన్ చూడండి. ఈ ఒక్క సీన్ రామాయణ సినిమా రెండు భాగాల కంటే బెటర్’’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
{{/usCountry}}రామాయణ ట్రైలర్ ను వారణాసి టీజర్ గ్లింప్స్ తో పోలుస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ‘‘రామాయణ ట్రైలర్ ఓ లేజీ ఏఐ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. అందులో నిజంగా ఏం లేదు. వారణాసిలోని ఈ సీన్ చూడండి. ఈ ఒక్క సీన్ రామాయణ సినిమా రెండు భాగాల కంటే బెటర్’’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
{{/usCountry}}యష్ గుర్తుండిపోతాడంటూ
రావణాసురుడిగా యష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, 'ఆరా' ప్రేక్షకులను కట్టిపడేశాయి. "తరతరాలు గుర్తుండిపోయేలా రావణుడి పాత్రలో యష్ జీవించేశారు" అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
విఎఫ్ఎక్స్ లో మార్పులు
గతంలో వచ్చిన రామాయణ ప్రమోషనల్ వీడియోపై సిజిఐ విమర్శలు రాగా, ఈసారి DNEG సంస్థ అందించిన ఐరావతం సీన్, కలర్ గ్రేడింగ్, 3D డెప్త్ షాట్స్ టాప్ నాచ్ ఉన్నాయని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అయితే రూ.4000 కోట్ల బడ్జెట్ రేంజ్ ఇంకా కొన్ని సీన్లలో గ్రీన్‌స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల కనిపించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ట్రైలర్‌లో ఏం చూపించారు?
రాజభవన ద్వారాలను బద్దలు కొడుతూ ఎంట్రీ ఇచ్చిన రావణాసురుడు (యష్) తన క్రూరత్వంతో "ఇది రావణ రాజ్యానికి ఆరంభం" అని ఘర్జించే సీన్‌తో ట్రైలర్ గూస్‌బంప్స్ పుట్టిస్తోంది. లోకాలను కాపాడేందుకు శ్రీమహావిష్ణువు అయోధ్య రాజైన దశరథుడి (అరుణ్ గోవిల్) పుత్రుడు రాముడి (రణ్‌బీర్ కపూర్) రూపంలో జన్మించడం, తమ్ముడు లక్ష్మణుడి (రవి దూబే)తో కలిసి రాక్షస సంహారం చేయడం అద్భుతంగా ఆవిష్కరించారు.
కైకేయి (లారా దత్తా)కి ఇచ్చిన మాట ప్రకారం రాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లడం, ఆయన వెంట సీతాదేవి (సాయి పల్లవి) అడవులకు పయనమవ్వడం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే ఈ ట్రైలర్‌లో హనుమంతుడిగా నటిస్తున్న సన్నీ డియోల్ పాత్రను చూపించకపోవడం గమనార్హం. ఆయన ఎంట్రీని రెండవ భాగం కోసం దాచిపెట్టి ఉండవచ్చని సమాచారం.
నమిత్ మల్హోత్రా, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్స్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ విజువల్ వండర్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.