...
...
Next Story

Rana Daggubati: ఆ మూవీలో క్యామియో కోసం నన్ను కిడ్నాప్ చేశారు.. 13 ఏళ్ల నాటి సీక్రెట్ బయటపెట్టిన రానా దగ్గుబాటి!

Rana Daggubati: రణబీర్ కపూర్, దీపికా పదుకొనె జంటగా నటించిన 'యే జవానీ హై దీవానీ' సినిమాలో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఓ క్యామియోలో మెరిశారు. అయితే ఆ పాత్ర కోసం తనను రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ కిడ్నాప్ చేశారని రానా తాజాగా సరదా కామెంట్స్ చేశారు.

Published on: Oct 26, 2026, 10:42:27 IST
Advertisement

Rana Daggubati: పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2013లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన 'యే జవానీ హై దీవానీ' హిందీ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రానా క్యామియో

ఆ మూవీలో క్యామియో కోసం నన్ను కిడ్నాప్ చేశారు.. 13 ఏళ్ల నాటి సీక్రెట్ బయటపెట్టిన రానా దగ్గుబాటి!
ఆ మూవీలో క్యామియో కోసం నన్ను కిడ్నాప్ చేశారు.. 13 ఏళ్ల నాటి సీక్రెట్ బయటపెట్టిన రానా దగ్గుబాటి!

యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ యే జవానీ హై దీవానీ చిత్రంలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనె జంటగా నటించారు. మ్యూజికల్ గా, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమాలో రానా ఓ చిన్న క్యామియో (అతిథి పాత్ర)లో కనిపించి సందడి చేశారు. తాజాగా ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో జరిగిన 'ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ (IFP 2026)' ఈవెంట్ లో పాల్గొన్న రానా.. ఈ సినిమాలో తన ఎంట్రీ వెనుక జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను అభిమానులతో పంచుకున్నారు.

నన్ను కిడ్నాప్ చేశారు

"రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ నాకు చాలా మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర కోసం ముందుగా ఓ పెద్ద స్టార్ హీరోను అడిగారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించడంతో వెంటనే వీళ్లిద్దరూ నేను ఉన్న హోటల్ రూమ్ కు వచ్చారు.

అప్పుడు నేను వేరే సినిమా షూటింగ్ పనుల్లో ఉన్నాను. నేను చెప్పేది ఏదీ వినకుండా.. ఈ రాత్రికే మాతో పాటు ఉదయపూర్ రావాల్సిందే అని పట్టుబట్టి నన్ను కిడ్నాప్ చేసినంత పని చేశారు. నేరుగా ఫ్లైట్ ఎక్కించి ఉదయపూర్ షూటింగ్ స్పాట్ కు తీసుకెళ్లారు" అని రానా నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

రాత్రికి రాత్రే షూటింగ్ కంప్లీట్

ఇక ఈ మూవీ హీరో హీరోయిన్ల భవిష్యత్తు ప్రాజెక్టుల విషయానికొస్తే.. రణబీర్ కపూర్ ప్రస్తుతం నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రామాయణం - పార్ట్ 1'లో శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

మరోవైపు హీరోయిన్ దీపికా పదుకొనె సైతం బడా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో 'కింగ్' సినిమా చేస్తున్న దీపికా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'రాకా' మూవీలో కూడా ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks