Ranabaali Collection: రణబాలికి తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్- లైగర్, కింగ్డమ్‌ను దాటలేకపోయిన విజయ్-ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Ranabaali Box Office Collection Day 1: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూడోసారి జంటగా నటించిన క్రేజీ పీరియాడిక్ డ్రామా 'రణబాలి' శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న రణబాలికి తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయి? విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.

Published on: Oct 17, 2026, 09:34:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ranabaali 1st Day Worldwide Box Office Collection: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' థియేటర్లలో నిన్న అక్టోబర్ 16న అడుగుపెట్టింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. గడిచిన కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది.

రణబాలికి తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్- లైగర్, కింగ్డమ్‌ను దాటలేకపోయిన విజయ్-ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రణబాలికి తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్- లైగర్, కింగ్డమ్‌ను దాటలేకపోయిన విజయ్-ఎన్ని కోట్లు వచ్చాయంటే?

తొలిరోజు బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏంటి?

ట్రేడ్ నివేదికల ప్రకారం 'రణబాలి' చిత్రం భారతదేశంలో తొలిరోజు దాదాపు రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాక్ సాధారణంగా ఉండటంతో తొలిరోజు వసూళ్లు మరీ ఆశాజనకంగా ఏమీ లేవు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 'లైగర్' (రూ. 15.95 కోట్లు) రికార్డును ఈ సినిమా దాటలేకపోయింది.

గత ఏడాది వచ్చిన 'కింగ్డమ్' సాధించిన రూ. 15 కోట్ల ఓపెనింగ్స్ కంటే కూడా రణబాలి వెనుకబడింది. అయితే విజయ్, మృణాల్ ఠాకూర్ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా తొలిరోజు వసూలు చేసిన రూ. 5.75 కోట్లతో పోలిస్తే మాత్రం రణబాలికి మెరుగైన కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు.

రణబాలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్

తొలి రోజు రణబాలి సినిమాకు ఇండియాలో 9.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా, రూ. 10.75 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే, ఓవర్సీస్‌లో మొదటి రోజున రణబాలి మూవీకి రూ. 5.75 కోట్లు నమోదైనట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్‌గా విజయ్ రష్మికల మూడో సినిమా రణబాలికి రూ. 16.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 2,515 థియేటర్లలో స్క్రీనింగ్ అవుతోన్న రణబాలి సినిమాకు ఫస్ట్ డే 57 శాతం థియేటరల్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

1870 నాటి కరువు నేపథ్యం - అసలు కథేంటి?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన రణబాలి చిత్రాన్ని టి-సిరీస్ సమర్పించింది. 19వ శతాబ్దంలో, అంటే 1870ల కాలంలో బ్రిటిష్ పాలనలో దక్షిణాదిలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

బ్రిటిష్ అధికారుల అణచివేతకు వ్యతిరేకంగా, తన గ్రామాన్ని కాపాడుకునేందుకు పోరాడిన రణబాలి అనే వీరుడి కథే ఇది. ఇందులో రణబాలిగా విజయ్ దేవరకొండ నటించగా, ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా కనిపించారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ అధికారి 'సర్ థియోడోర్ హెక్టర్' అనే ప్రతి నాయకుడి పాత్రను పోషించారు.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత మళ్లీ అదే జోడీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలసి నటించిన 'గీత గోవిందం' బ్లాక్‌బస్టర్ విజయం సాధించగా, 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన మూడో సినిమా ఇది కావడంతో ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచీ విపరీతమైన క్రేజ్ నెలకొంది. అయితే తెరపై వీరి కేమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ, కథనం నెమ్మదించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More