...
...
Next Story

Ranabaali Actor: ఆ సీన్ చేస్తూ ఏడ్చేశా- రణబాలిలో క్రూరమైన బ్రిటిష్ అధికారిగా బెనెడిక్ట్- పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

Ranabaali Actor: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ సినిమాలో అత్యంత క్రూరమైన పాత్రలో బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ నటించాడు. రణబాలి మూవీ గురించి అతను 'హిందూస్థాన్ టైమ్స్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Published on: Oct 13, 2026, 09:43:01 IST
Advertisement

Ranabaali Actor: 'రణబాలి' ట్రైలర్‌లో ఓ చిన్న పిల్లాడిని వంట చేసే పెద్ద పాత్రలో వేసే సన్నివేశం చూసి ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. ఆ క్రూరమైన బ్రిటీష్ అధికారి పాత్ర పోషించింది బెనెడిక్ట్ గారెట్. అతను ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. "నేను గతంలో కూడా స్వాతంత్య్రానికి పూర్వం నాటి క్రూరమైన బ్రిటిష్ అధికారుల పాత్రలు చేశాను. కానీ 'రణబాలి'లోని ఈ క్యారెక్టర్ వాటన్నింటికంటే అత్యంత క్రూరమైంది’’ అని తెలిపారు.

సీన్ చూసి ఏడ్చా

ఆ సీన్ చేస్తూ ఏడ్చేశా- రణబాలిలో క్రూరమైన బ్రిటిష్ అధికారిగా బెనెడిక్ట్- పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
ఆ సీన్ చేస్తూ ఏడ్చేశా- రణబాలిలో క్రూరమైన బ్రిటిష్ అధికారిగా బెనెడిక్ట్- పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

భారతదేశంలో బ్రిటిష్ పాలకులు ధాన్యాన్ని విదేశాలకు తరలిస్తూ, స్థానికులను ఆకలితో అలమటించేలా చేసిన మానవ నిర్మిత కరువు (Man-made Famine) నేపథ్యంలో ఈ రణబాలి సినిమా తెరకెక్కింది. "ట్రైలర్‌లోని వైలెంట్ సీన్ చూసి కొందరు ఇది అవసరమా అని అడగవచ్చు. కానీ నాటి నిజ జీవితంలో బ్రిటిష్ వారు చేసిన అకృత్యాలు దీనికంటే చాలా దారుణంగా ఉండేవి. సినిమాలో చూపించే హింస కంటే, అప్పట్లో నిజంగా జరిగిన హింస చాలా భయంకరమైనది. నేను చేసిన ఒక సీన్ చూసి ఏడ్చేశా’’ అని బెనెడిక్ట్ పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండతో కాంబినేషన్

విజయ్ దేవరకొండతో పనిచేయడంపై బెనెడిక్ట్ స్పందిస్తూ.. "పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' కంటే ముందే నేను విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ అది కుదరలేదు. ఇప్పుడు 'రణబాలి' ద్వారా విజయ్, రష్మిక మందన్నలతో కలిసి నటించే అవకాశం దక్కింది" అని చెప్పారు.

హరిహర వీరమల్లుపై కామెంట్స్

తెలుగు భాష, ప్రొడక్షన్ ప్లానింగ్ గురించి కూడా బెనెడిక్ట్ మాట్లాడారు. "నాకు హిందీ వచ్చు కానీ తెలుగు చాలా విభిన్నమైనది. ఇటాలియన్ భాషలా పొయెటిక్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సెట్స్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ పరంగా కొంత ప్లానింగ్ లోపించేది.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో పాటు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo - ది మమ్మీ ఫేమ్), బెనెడిక్ట్ గారెట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పీరియాడిక్ ఎపిక్ యాక్షన్ మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 16, 2026) థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks