...
...
Next Story

Endayya Saami: విరోష్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రణబాలి మేకర్స్- ఏందయ్య సామి సాంగ్ రిలీజ్- పర్‌ఫెక్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ అంటూ!

Endhayya Saami Song Release From Ranabaali For Virosh: టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విరోష్ వెడ్డింగ్ సందర్భంగా వీరిద్దరు కలిసి నటించిన 'రణబాలి' చిత్రం నుంచి 'ఏందయ్య సామీ' సాంగ్ రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపింది.

Published on: Feb 28, 2026, 13:16:27 IST
Advertisement

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల ప్రేమ ప్రయాణం పెళ్లి పీటల వరకు చేరింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా విజయ్, రష్మిక వివాహం జరిగింది.

సోషల్ మీడియాలో ఫొటోలు

విరోష్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రణబాలి మేకర్స్- ఏందయ్య సామి సాంగ్ రిలీజ్- పర్‌ఫెక్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ అంటూ!
విరోష్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రణబాలి మేకర్స్- ఏందయ్య సామి సాంగ్ రిలీజ్- పర్‌ఫెక్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ అంటూ!

సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి ఫోటోలను పంచుకున్న ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ తన 'వదిన' రష్మికకు అధికారికంగా కుటుంబంలోకి స్వాగతం పలికారు.

కొత్త జంట కోసం 'ఎందయ్య సామీ'..

ఇక విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali). విరోష్ వెడ్డింగ్ సందర్భంగా ఈ కొత్త జంటకు మ్యారేజ్ గిఫ్ట్‌గా చిత్ర యూనిట్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. రణబాలి సినిమాలో వీరిద్దరి మధ్య సాగే 'ఎందయ్య సామీ' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

రొమాంటిక్‌గా కపుల్

పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా మారిన విజయ్, రష్మికల మధ్య చిగురించే ప్రేమను ఈ పాటలో ఎంతో అందంగా చూపించారు. అలాగే, ఏందయ్యా సామి పాటలో రొమాంటిక్‌గా కపుల్ ఎలా ఉంటారో చూపించారు. పాట చివరలో 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్, రష్మిక' అంటూ మేకర్స్ నవ దంపతులకు విషెస్ చెప్పారు.

పర్‌ఫెక్ట్ గిఫ్ట్

అజయ్-అతుల్ సంగీతం అందించిన ఈ పాటను శ్వేతా మోహన్, అజయ్ గోగవలే ఆలపించగా.. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. పాటను చూసిన అభిమానులు "వీరి పెళ్లి సమయంలో ఈ పాట పర్‌ఫెక్ట్ గిఫ్ట్.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం చూడటం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంప్రదాయబద్ధంగా వివాహ వేడుక

అనంతరం రష్మిక మందన్నా కుటుంబ సంప్రదాయమైన 'కొడవ' పద్ధతిలో కూడా పెళ్లి చేశారు. విజయ్ ఐవరీ సిల్క్ ధోవతి, అంగవస్త్రంలో మెరిసిపోగా.. రష్మిక ఎంతో ఖరీదైన కంచి పట్టుచీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు.

మిత్రమా.. నా ప్రాణప్రదమా!

పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ విజయ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నాను. ఒకరోజు ఆమెను నేను చాలా మిస్ అయ్యాను. నా పక్కన తను ఉంటే నా రోజు ఇంకా బాగుంటుందని, నా భోజనం మరింత పరిపూర్ణంగా ఉంటుందని అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా సరే.. ఇంటి దగ్గర ఉన్నామన్న ప్రశాంతత కలగాలంటే తను నా పక్కన ఉండాలని అర్థమైంది" అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు విజయ్.

త్వరలో 'రణబాలి'గా పలకరించనున్న 'విరోష్'

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్-రష్మిక జంటగా వస్తున్న మూడో చిత్రం 'రణబాలి'. ఇందులో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా నటిస్తున్నారు. 19వ శతాబ్దపు బ్రిటిష్ కాలం నాటి చారిత్రక అంశాల ఆధారంగా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe