Ranabaali OTT Release Date: థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన 'రణబాలి' సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో 'రణబాలి' ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ చేసిన పొరపాటుతో రణబాలి మూవీ స్ట్రీమింగ్ డేట్ లీక్ అయింది. సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్టు పెట్టింది. అయితే ఏమైందో ఏమో కానీ, పెట్టిన కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే కొందరు నెటిజన్లు ఆ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.
ఆ డిలీట్ చేసిన పోస్ట్ ప్రకారం నవంబర్ 13, 2026న రణబాలి సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా మల్టీపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి విడుదలైన మొదటి రోజు కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే రాను రాను మౌత్ టాక్‌తో పుంజుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది.
80 కోట్ల కలెక్షన్లు
అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.80 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
హ్యాట్రిక్ కొట్టిన విజయ్-రష్మిక జోడీ
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మూడోసారి జంటగా నటించిన చిత్రమిది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ 'రణబాలి' సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పెళ్లి తర్వాత
{{/usCountry}}గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మూడోసారి జంటగా నటించిన చిత్రమిది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ 'రణబాలి' సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పెళ్లి తర్వాత
{{/usCountry}}విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత కలిసి నటించిన ఫస్ట్ మూవీ రణబాలి. విజయ్ తన పీరియాడిక్ క్యారెక్టర్‌లో జీవించాడని, సరికొత్త లుక్‌లో అదరగొట్టాడని ప్రశంసలు దక్కాయి. అలాగే సూపర్ హిట్ 'టాక్సీవాలా' తర్వాత విజయ్, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో రణబాలిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి, దానికి తగ్గట్టే సినిమా మెప్పించింది.
ఓటీటీలోనూ
రణబాలి సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషించడం విశేషం. ఆయనతో పాటు ఈశ్వరీ రావు, మలయాళ నటుడు లాల్, వినోద్ సాగర్, మధునందన్, పోలిమేర కిషోర్ కుమార్ తదితరులు తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
మరాఠీ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన సంగీతం, పవర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోశాయి. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుండటంతో.. ఓటీటీలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూవర్‌షిప్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.