...
...
Next Story

Ranabaali Song: విజయ్ దేవరకొండ రుద్ర తాండవం.. పవర్ ఫుల్ గా రణబాలి సెకండ్ సింగిల్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న కోబలి సాంగ్

Ranabaali Song: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రణబాలి’. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఇవాళ రిలీజైంది. ఇప్పటికే ఫస్ట్ పాట ‘ఏందయ్యా సామి’ ఈ మూవీపై హైప్ పెంచేసింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ గా వచ్చిన ‘కోబలి’ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

Published on: Oct 11, 2026, 17:23:40 IST
Advertisement

Ranabaali Song: తెలుగు సినీ లవర్స్ అత్యంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ హైప్ ను మరింత పెంచేలా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ‘కోబలి’ వచ్చేసింది.

రణబాలి నుంచి రెండో పాట

రణబాలి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. ఈ సారి పవర్ ఫుల్ గా పాట (x/RanabaaliFilm)
రణబాలి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. ఈ సారి పవర్ ఫుల్ గా పాట (x/RanabaaliFilm)

భార్యాభర్తలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘రణబాలి’ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లడం కోసం మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో పాటను ఫస్ట్ స్పాటిఫై లో రిలీజ్ చేశారు.

కోబలి అంటూ సాగుతున్న ఈ పాట లిరికల్ వీడియోను ఆ తర్వాత యూట్యూబ్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట చాలా పవర్ ఫుల్ గా ఉంది. లిరిక్స్ ఎంతో అర్థవంతంగా సాగుతున్నాయి. ఈ రణబాలి సినిమాకు అజయ్-అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఏందయ్యా సామి

ఇప్పటికే రణబాలి మూవీ నుంచి ‘ఏందయ్యా సామి’ పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండు వారాల క్రితం రిలీజైన ఈ పాటకు ఇప్పటివరకూ యూట్యూబ్ లో 40 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. మనసుకు తాకే లిరిక్స్ తో సాగుతున్న ఈ పాట తెగ వైరల్ గా మారింది. కొత్త దంపతుల మధ్య రొమాన్స్ ను ఈ సాంగ్ లో చక్కగా చూపించారు.

రణబాలి గురించి

తన మాతృభూమిని, తన ప్రజలను రక్షించుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే లోకల్ హీరో 'రణబాలి'గా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. బ్రిటిష్ కమిషనర్ కు ఎదురొడ్డి నిలిచిన రణబాలిని వారు 'సావేజ్' (క్రూరుడు) అని పిలుస్తారు. ఆ కాలంలో తొక్కిపెట్టిన నిజమైన చరిత్రను, మనుగడ కోసం సాగించిన ఉత్కంఠభరితమైన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

రణబాలి రిలీజ్

రణబాలి చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఒక చిన్న మార్పు ఏంటంటే.. ఓవర్సీస్ (విదేశాల్లో)లో అక్టోబర్ 16న కేవలం ఒరిజినల్ తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుంది. మిగిలిన ఇతర భాషల (హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) డబ్బింగ్ కంటెంట్ రెడీ కావడంలో కొంత ఆలస్యం జరగడం వల్ల వాటిని అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks