Ranveer Singh: రూ.1300 కోట్ల హీరో.. ప్రశాంతత కోసం అక్కడికి వెళ్తాడట! రణ్‌వీర్ షేర్ చేసిన సీక్రెట్ ఏంటి?
‘హిందుస్థాన్ టైమ్స్’ తో ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. లైఫ్ కొన్ని సార్లు క్రేజీగా మారుతుందని, రీసెట్ చేసుకోవడానికి కాస్త ప్రశాంతత అవసరమని అతనన్నాడు. ధురంధర్ సినిమాతో రూ.1300 కోట్ల హీరోగా మారిన అతను ప్రశాంతత కోసం అబుదాబి వెళ్తానని చెప్పాడు.
ఎప్పుడూ ఎనర్జీతో ఎంతో హుషారుగా కనిపించే హీరో రణ్‌వీర్ సింగ్. అతను రీసెంట్ గా ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ధురంధర్ ది రివేంజ్ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. మరోవైపు అబుదాబి టూరిజం అంబాసిడర్ గానూ కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ తో ఇంటర్వ్యూలో రణ్‌వీర్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
రణ్‌వీర్ సింగ్ (Photo: Instagram)
రణ్‌వీర్ సింగ్ కామెంట్లు
'హిందుస్థాన్ టైమ్స్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌వీర్ కామెంట్లు వైరల్ గా మారాయి. "నా లైఫ్ కొన్నిసార్లు క్రేజీగా మారుతుంది. స్పీడ్ గా సాగిపోతుంది. ఆ సమయంలో నేను కాస్త ప్రశాంతత కోరుకుంటా. సైలెంట్ గా ఉండాలని అనుకుంటా. ఆ ప్రెషర్ ను దూరం చేసుకోవడానికి సైలెన్స్ నాకు హెల్ప్ చేస్తుంది. దీంతో మళ్లీ కొత్తగా రీసెట్ అవుతా’’ అని రణ్‌వీర్ సింగ్ చెప్పాడు.
అదే పర్ఫెక్ట్ ప్లేస్
‘‘లైఫ్ లో రీసెట్ అవడానికి నాకు పర్ఫెక్ట్ ప్లేస్ అబుదాబి. అక్కడ నేను నా స్పీడ్ తగ్గించుకుంటా. కాస్త స్లో అవుతా. అల్ ఐన్ ఒయాసిస్ లో వాకింగ్ నుంచి, సాదియత్ బీచ్ క్లబ్ లో పూల్ సైడ్ రెస్ట్ వరకు.. అక్కడ ప్రతి విషయం నాకు కావాల్సిన విశ్రాంతినిస్తుంది. అదెంతో విలువైందని నేను భావిస్తా’’ అని అబుదాబి టూరిజం ప్రచారకర్తగా కొనసాగుతున్న రణ్‌వీర్ సింగ్ తెలిపాడు.
ఇంట్రెస్ట్ తో ఉన్నా
రణ్‌వీర్ సింగ్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్, కల్చర్ లో కోర్సు చేశాడు. అందుకే కల్చర్ గురించి స్టడీ చేయడంలో ఎంతో ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు. "జ్ఞానం సంపాదించుకోవాలనే క్యూరియాసిటీ నాకు ఎక్కువ. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆకలి నాకెప్పుడూ ఉంటుంది. నేను యూనివర్సిటీలో కమ్యూనికేషన్, కల్చర్ గురించి చదివా. కల్చర్ గురించి తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నా’’ అని రణ్‌వీర్ తెలిపాడు.
ధురంధర్ గురించి
ఆదిథ్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన మూవీ ధురంధర్. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇందులో రణ్‌వీర్ తో పాటు సారా అర్జున్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తదితరులు నటించారు.
సీక్వెల్
ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ రాబోతుంది. మార్చి 19, 2026న థియేటర్లలో అది రిలీజ్ కానుంది. అదే రోజు యష్ హీరోగా నటించిన టాక్సిక్ కూడా విడుదల అవుతుంది.