Ranveer Singh: బాలీవుడ్ ఎనర్జటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ భారతీయ వినోద రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రఖ్యాత బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ 'క్రోల్' (Kroll) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల జాబితాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి రణ్‌వీర్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.

ఏకంగా 162.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1539 కోట్లు) బ్రాండ్ వ్యాల్యూతో ఆయన ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.
నంబర్ 1 స్థానంలో కింగ్ ఖాన్.. తప్పుకున్న విరాట్
ఈ టాప్ 10 లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 177.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గతేడాది వరకు నంబర్ 1 పొజిషన్‌లో ఏకచక్రాధిపత్యం చెలాయించిన విరాట్ కోహ్లీ.. ఈసారి 158.4 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.
మరోవైపు టీమిండియా లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ (125.9 మిలియన్ డాలర్లు) నాలుగో స్థానంలో, ఎంఎస్ ధోనీ (115.3 మిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచి తమ గ్లోబల్ క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించారు.
హీరోయిన్లలో ఆలియా టాప్.. రణ్‌బీర్‌కు బిగ్ షాక్
లేడీ సెలబ్రిటీల కేటగిరీలో స్టార్ నటి ఆలియా భట్ 93.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ఆరో స్థానంలో నిలిచి సత్తా చాటారు. ఆమె తర్వాత రణ్‌వీర్ భార్య, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకోన్ 89.2 మిలియన్ డాలర్లతో ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
హృతిక్ రోషన్ ఎనిమిదో స్థానంలో, అమితాబ్ బచ్చన్ తొమ్మిదో స్థానంలో నిలవగా, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్ పదో స్థానానికి పరిమితమయ్యారు. యానిమల్ లాంటి హిట్ కొట్టినా రణ్‌బీర్ కపూర్ ఈ లిస్ట్‌లో చిట్టచివరన ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
'ధురంధర్' బ్లాక్బస్టర్లు.. 'ప్రళయ్' కోసం గ్రాండ్ ప్లాన్
{{/usCountry}}హృతిక్ రోషన్ ఎనిమిదో స్థానంలో, అమితాబ్ బచ్చన్ తొమ్మిదో స్థానంలో నిలవగా, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్ పదో స్థానానికి పరిమితమయ్యారు. యానిమల్ లాంటి హిట్ కొట్టినా రణ్‌బీర్ కపూర్ ఈ లిస్ట్‌లో చిట్టచివరన ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
'ధురంధర్' బ్లాక్బస్టర్లు.. 'ప్రళయ్' కోసం గ్రాండ్ ప్లాన్
{{/usCountry}}రణ్‌వీర్ సింగ్ బ్రాండ్ వాల్యూ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన ఇటీవలి బాక్సాఫీస్ హిట్లు ప్రధాన కారణం. ఆయన నటించిన 'ధురంధర్', 'ధురంధర్ 2' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఆయన రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ 'ప్రళయ్' అనే ఇంటెన్స్ యాక్షన్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత భార్య దీపికా పదుకోన్ రెండవ డెలివరీ కోసం ప్రత్యేకంగా 'పెటర్నిటీ బ్రేక్' తీసుకోనున్నారు. జనవరి వరకు కుటుంబంతో సమయం గడిపిన తర్వాతే ఆయన మళ్లీ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతారు.