Ranveer Singh: ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త సంచలనం నమోదైంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ఏ టాప్ సూపర్ స్టార్ కూ సాధ్యం కాని రీతిలో.. కేవలం ఒక్క సినిమా ఫ్రాంచైజీ ద్వారా ఏకంగా రూ. 325 కోట్ల భారీ సంపాదనతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం లేదా లాభాలు అందుకున్న నెంబర్ వన్ నటుడిగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నిలిచినట్లు ట్రేడ్ వర్గాల తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ దగ్గర నాన్‌స్టాప్ విధ్వంసం సృష్టించిన ఒక భారీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ వల్లే ఆయనకు ఈ రేంజ్ లో లాభాలు దక్కాయి.
రూ. 3,200 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ‘ధురంధర్’
రణ్‌వీర్ సింగ్ కు ఈ చారిత్రాత్మక సంపాదనను తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్ మరేదో కాదు.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన రెండు భాగాల యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'ధురంధర్' (Dhurandhar). మొదట ఒకే షెడ్యూల్ లో ఒకే చిత్రంగా ప్లాన్ చేసి షూట్ చేసిన ఈ సినిమాను ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేశారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్ లో ఏకంగా రూ. 3,200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయి. కేవలం ఇండియాలోనే రూ. 1,900 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ భారీ సక్సెస్ తో రణవీర్ సింగ్ ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ స్టార్ గా అవతరించారు.
ప్రాఫిట్ షేరింగ్ మ్యాజికల్ స్కెచ్..
సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు ఒక సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారు. కానీ రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాకు చాలా స్మార్ట్ గా ఆలోచించి 'ప్రాఫిట్ షేరింగ్' (లాభాల్లో వాటా) అగ్రిమెంట్ చేసుకున్నారు. అంతేకాదు షూటింగ్ సమయంలో బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో.. రణ్‌వీర్ స్వయంగా తన సొంత డబ్బును కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో సినిమా లాభాల్లో ఆయన వాటా మరింత పెరిగింది.
{{/usCountry}}సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు ఒక సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారు. కానీ రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాకు చాలా స్మార్ట్ గా ఆలోచించి 'ప్రాఫిట్ షేరింగ్' (లాభాల్లో వాటా) అగ్రిమెంట్ చేసుకున్నారు. అంతేకాదు షూటింగ్ సమయంలో బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో.. రణ్‌వీర్ స్వయంగా తన సొంత డబ్బును కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో సినిమా లాభాల్లో ఆయన వాటా మరింత పెరిగింది.
{{/usCountry}}సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక వచ్చిన భారీ వసూళ్లు, డిస్ట్రిబ్యూషన్ బోనస్‌లు, వీటికి తోడు డిజిటల్ (ఓటీటీ), సాటిలైట్, మ్యూజిక్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తం బిజినెస్ లాభాలను లెక్కించగా.. రణ్‌వీర్ సింగ్ వాటా కిందకు ఏకంగా రూ. 325 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లోని ప్రొడక్షన్ హౌసెస్ కు మెజారిటీ లాభాలు వెళ్లినప్పటికీ.. ఒక సింగిల్ ప్రాజెక్ట్ నుంచి ఒక ఇండియన్ యాక్టర్ అందుకున్న బిగ్గెస్ట్ పేఅవుట్ ఇదే కావడం విశేషం.
రజనీ, షారుఖ్, అల్లు అర్జున్ రికార్డులు అవుట్!
ఈ భారీ సంపాదనతో రణ్‌వీర్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను దాటేశారు. దీనికంటే ముందు ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ రికార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిట ఉండేది. ఆయన 'జైలర్' సినిమాకు రూ. 250 కోట్లకు పైగా అందుకున్నట్లు టాక్ ఉంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమాకు, రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రూ. 200 కోట్ల మార్కును దాటేశారు.
బాలీవుడ్ లో అంతకుముందు కింగ్ షారుఖ్ ఖాన్ 2023 లో వచ్చిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలకు ఒక్కో దానికి రూ. 200 కోట్ల వరకు ప్రాఫిట్స్ రూపంలో అందుకుని టాప్ లో ఉండేవారు. గతంలో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కూడా ఇలాంటి ప్రాఫిట్ షేరింగ్ డీల్స్ తోనే భారీగా సంపాదించేవారు. కానీ ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ఏకంగా రూ. 325 కోట్లతో వాళ్లందరినీ వెనక్కి నెట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త మైల్‌స్టోన్ సెట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం స్టార్ హీరోలు కేవలం ఫీజు మాత్రమే నమ్ముకోకుండా.. ఇలా లాభాల్లో వాటాలు తీసుకోవడం వల్లే ఇంతటి భారీ వసూళ్లు సాధ్యమవుతున్నాయి.