...
...
Next Story

Dhurandhar 2 Collection: చిత్ర పరిశ్రమపై అణుబాంబు- 1300 కోట్లు దాటేసిన ధురంధర్ 2 కలెక్షన్స్- బాహుబలి 2కి సవాల్!

Dhurandhar 2 Box Office Collection Day 11: రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 1,000 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Published on: Mar 30, 2026, 06:55:06 IST
Advertisement

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్ 2' ప్రభంజనం ఆగడం లేదు. రెండో వారాంతంలోనూ ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. 11వ రోజైన రెండో ఆదివారం (మార్చి 29) నాడు ఈ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి.

ఇండియా కలెక్షన్స్

చిత్ర పరిశ్రమపై అణుబాంబు- 1300 కోట్లు దాటేసిన ధురంధర్ 2 కలెక్షన్స్- బాహుబలి 2కి సవాల్!
చిత్ర పరిశ్రమపై అణుబాంబు- 1300 కోట్లు దాటేసిన ధురంధర్ 2 కలెక్షన్స్- బాహుబలి 2కి సవాల్!

తాజా లెక్కల ప్రకారం మార్చి 29 (రాత్రి 10 గంటల సమయానికి) 'ధురంధర్ 2' కేవలం 11వ రోజే దేశవ్యాప్తంగా రూ. 69.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో భారత్‌లో ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 1,013.15 కోట్లకు చేరుకున్నాయి. అదే నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే రూ. 847.87 కోట్లతో దూసుకుపోతోంది.

రికార్డుల వేట: రూ. 1,300 కోట్లు దాటిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

ఇక అంతర్జాతీయంగా కూడా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తన సత్తా చాటుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు రూ. 350 కోట్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 మొత్తం కలెక్షన్స్ రూ. 1,363.15 కోట్లకు చేరుకుని బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుతోంది. గతేడాది విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం లైఫ్ టైమ్ కలెక్షన్స్ (రూ. 840.20 కోట్లు నెట్) రికార్డును ఈ సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే అధిగమించడం విశేషం.

"చిత్ర పరిశ్రమపై అణుబాంబు పడింది"

'ధురంధర్ 2' సృష్టిస్తున్న విధ్వంసంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ.. "ఆదిత్య ధర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కింద ఒక అణుబాంబును పేల్చారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిత్ర పరిశ్రమలోని మిగిలిన వారు ఈ విజయంపై నోరు విప్పకుండా మౌనంగా ఉండటం" అంటూ చమత్కరించారు.

బాలీవుడ్ బాద్‌షాతో రణ్‌వీర్ సందడి

హిందీ: రూ. 17.31 కోట్లు (45% ఆక్యుపెన్సీ)

తెలుగు: రూ. 60 లక్షలు

తమిళం: రూ. 25 లక్షలు

కాగా, ధురంధర్ 2 సినిమా ధాటికి అక్షయ్ కుమార్ నటిస్తున్ననటించిన 'భూత్ బంగ్లా' సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' వేగం చూస్తుంటే, త్వరలోనే 'బాహుబలి 2' రికార్డులను కూడా సవాల్ చేసేలా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe