దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

తాజాగా ఈ దురంధర్ చిత్రం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా ఉన్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ రికార్డును దురంధర్ సినిమా బద్దలు కొట్టింది.
నార్త్ అమెరికాలో రికార్డుల వేట
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ధురంధర్ నార్త్ అమెరికాలో నాలుగో మంగళవారం (డిసెంబర్ 30) నాటికి 17.50 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. గతంలో ‘పఠాన్’ సాధించిన 17.49 మిలియన్ డాలర్ల వసూళ్లను దురంధర్ దాటేసింది.
దీంతో నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి హిందీ చిత్రంగా దురంధర్ నిలిచింది. అలాగే, ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న షారుక్ ఖాన్ పఠాన్ మూవీని వెనక్కి నెట్టేసింది ఈ సినిమా. అయితే, భారతీయ సినిమాల జాబితాలో చూస్తే.. ‘బాహుబలి 2’ (20+ మిలియన్ డాలర్లు), ‘కల్కి 2898 ఏడీ’ (18.50+ మిలియన్ డాలర్లు) తర్వాత మూడో స్థానంలో ధురంధర్ కొనసాగుతోంది.
వ్యాపార పరంగా భారీ నష్టం
అయితే, నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి రెండు ఇండియన్ సినిమాల్లో టాలీవుడ్ నుంచే ఉండటం విశేషం. మరోవైపు, దురంధర్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ పర్నాబ్ కపాడియా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు పాకిస్తాన్లో ఈ దురంధర్‌పై నిషేధం విధించడం వల్ల సుమారు 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 90 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు పాకిస్తాన్లో ఈ దురంధర్‌పై నిషేధం విధించడం వల్ల సుమారు 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 90 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}"సాధారణంగా గల్ఫ్ దేశాలలో భారతీయ యాక్షన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. అక్కడ విడుదల అయి ఉంటే ధురంధర్ వసూళ్లు ఇంకా భారీగా ఉండేవి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజ జీవిత ఘటనల నేపథ్యం
కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ధురంధర్.. రెండు భాగాల సిరీస్‌లో మొదటిది. పాకిస్తాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్‌లోకి చొరబడే ఒక భారతీయ గూఢచారి కథాంశంతో ఇది తెరకెక్కింది. 1999 నాటి IC-814 విమానం హైజాక్, 2001 భారత పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు వంటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఆదిత్య ధర్ ఈ కథను అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు.