నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండల పెళ్లి గురించిన గుసగుసలు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఇదే నెలలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి రష్మిక, విజయ్ ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం వైరల్ గా మారింది. వీళ్లిద్దరు కలిసి ఒకే కార్లో వెళ్లారు.
ఎయిర్ పోర్ట్ లో రష్మిక, విజయ్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తాజాగా ముంబయి వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్ట్ లో వీళ్లు వేర్వేరుగానే కనిపించారు. విడివిడిగానే బయటకు వచ్చారు. రష్మిక బ్రౌన్ టాప్, బ్లాక్ జీన్స్, బూట్లతో సాధారణ దుస్తుల్లో కనిపించింది. ఆమె ఒక పుస్తకం పట్టుకుని, ఫోటోగ్రాఫర్‌లకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ టెర్మినల్ నుంచి బయటకు వెళ్లింది.
కార్లో కలిసి
విజయ్ దేవరకొండ కూడా అదే సమయంలో ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అతను బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమ రంగు ప్యాంట్ వేసుకున్నాడు. ముఖానికి మాస్క్ తో వచ్చిన విజయ్ ను ఓ ఫ్యాన్ గుర్తుపట్టాడు. ఆ అభిమానితో ఫొటో కోసం విజయ్ మాస్క్ తీశాడు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లకు దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత విజయ్, రష్మిక కలిసి ఒకే కార్లో విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
రష్మిక, విజయ్ పెళ్లి
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని కోటలో జరగనుందని సమాచారం. ఈ జంట 2025లో అక్టోబర్ 3న ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారని తెలిసింది. ఈ పెళ్లి పనుల్లోనే విజయ్, రష్మిక బిజీగా గడుపుతున్నారు.
సీఎం రేవంత్ తో
{{/usCountry}}రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని కోటలో జరగనుందని సమాచారం. ఈ జంట 2025లో అక్టోబర్ 3న ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారని తెలిసింది. ఈ పెళ్లి పనుల్లోనే విజయ్, రష్మిక బిజీగా గడుపుతున్నారు.
సీఎం రేవంత్ తో
{{/usCountry}}విజయ్ దేవరకొండ రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పెళ్లికి రేవంత్ రెడ్డిని పిలిచేందుకు విజయ్ వెళ్లారని తెలిసింది. ఇప్పుడు ముంబయిలో కొంతమంది సెలబ్రిటీలను తమ వెడ్డింగ్ కు ఆహ్వానించేందుకు రష్మిక, విజయ్ వెళ్లారని టాక్.
2018లో వచ్చిన గీత గోవిందం సినిమా కోసం రష్మిక, విజయ్ తొలిసారి కలిసి నటించారు. అప్పుడే వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. 2019లో వచ్చిన డియర్ కామ్రేడీ మూవీతో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు రష్మిక, విజయ్ కలిసి రణబాలి మూవీ చేస్తున్నారు.