టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా జోరుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరూ అక్టోబర్ 2025లో దసరాకు ముందే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు రాగా, తాజాగా ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి వివాహం జరగనుందని సన్నిహిత వర్గాలు ధృవీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రష్మిక స్వయంగా ఈ విషయంపై స్పందించింది.
సరైన సమయం వచ్చినప్పుడు చెబుతా..

ప్రేమ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలు, ఫిబ్రవరి 26న ఉదయపూర్ వెడ్డింగ్ గురించి రష్మికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "ఈ రూమర్స్ మొదలై ఇప్పటికి నాలుగేళ్లు అవుతోంది కదా? జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు. దాని కోసమే ఎదురుచూస్తున్నారు" అని చెప్పింది.
అందరూ ఆమె గుడ్ న్యూస్ చెబుతుందేమో అని ఎదురుచూస్తుండగా.. రష్మిక తెలివిగా సమాధానం దాటవేసింది. "నిజం ఏంటంటే.. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే దీని గురించి మాట్లాడతాను. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మేమే చెబుతాం" అని స్పష్టం చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో దీని గురించి మాట్లాడతానని హోస్ట్‌తో అనడం గమనార్హం.
ఉంగరాలు.. చేతిపై ముద్దు..
గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం వార్తలు వచ్చినప్పటి నుంచి వీరిద్దరి చేతి వేళ్లకు ఉంగరాలు కనిపిస్తున్నాయి. గత నవంబర్‌లో రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ ఈవెంట్‌లో విజయ్ ఆమె చేతిపై ముద్దు పెట్టడం వైరల్ అయ్యింది. అలాగే న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లోనూ, ఆ తర్వాత న్యూ ఇయర్ వెకేషన్‌లోనూ ఈ జంట కలిసి సందడి చేసింది.
రాజకోటలో పెళ్లి?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక పురాతన ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనుంది. నిశ్చితార్థంలాగే పెళ్లి కూడా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని భావిస్తున్నారట. హైదరాబాద్ తిరిగొచ్చాక రిసెప్షన్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
{{/usCountry}}విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక పురాతన ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనుంది. నిశ్చితార్థంలాగే పెళ్లి కూడా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని భావిస్తున్నారట. హైదరాబాద్ తిరిగొచ్చాక రిసెప్షన్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
{{/usCountry}}సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘ఛావా’, ‘సికిందర్’, ‘కుబేర’ వంటి చిత్రాలతో అలరించిన రష్మిక.. త్వరలో ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’ చిత్రాల్లో కనిపించనుంది. అటు విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ సినిమాతో పాటు మరో కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నాడు.