టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న రష్మిక మందన్నా తన 30వ పుట్టినరోజును ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నాకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. దీంతో ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.
కొడగు సంప్రదాయంలో వేడుకలు

రష్మిక స్వస్థలమైన కూర్గ్ (కొడగు)లో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు సందడి చేశారు. పుట్టినరోజు సందర్భంగా రష్మిక తన భర్త విజయ్‌తో కలిసి పాడి శ్రీ ఇగ్గుతప్ప ఆలయాన్ని సందర్శించారు. కొడవ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న రష్మిక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తండ్రి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ 'సెరినిటీ'
కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేయడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం ద్వారా ఈ జంట తమ ఉదారతను చాటుకుంది. ఇక ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం రష్మిక మందన్నా తండ్రి మదన్ తనకు ఇచ్చిన బహుమతి.
విరాజ్‌పేట సమీపంలోని ఒక ఖరీదైన విల్లాను రష్మికకు ఆమె తండ్రి కానుకగా ఇచ్చారు. ఈ విల్లాకు 'సెరెనిటీ' (ప్రశాంతత) అని పేరు పెట్టడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటిస్తున్న సమయంలో రష్మిక మందన్నా తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. పెళ్లి తర్వాత కూతురికి ఒక శాశ్వతమైన జ్ఞాపకాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి నుంచి బర్త్‌డే వరకు.. అన్నీ స్పెషలే!
గత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య విజయ్, రష్మికల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు 30వ ఏట అడుగుపెట్టిన రష్మికకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా అద్భుతమైన ఫేజ్‌లో ఉంది.
క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా రష్మిక
{{/usCountry}}గత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య విజయ్, రష్మికల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు 30వ ఏట అడుగుపెట్టిన రష్మికకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా అద్భుతమైన ఫేజ్‌లో ఉంది.
క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా రష్మిక
{{/usCountry}}కేవలం వ్యక్తిగత విషయాలే కాదు, రష్మిక కెరీర్ కూడా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. గతంలో విజయ్‌తో కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న రష్మిక మందన్నా త్వరలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే చిత్రంలో మళ్లీ విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది.
హిందీలోనూ రష్మిక హవా కొనసాగుతోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కాక్ టెయిల్-2' లో రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 19, 2026న విడుదల కానుంది. ఆధునిక సంబంధాలు, ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.