...
...
Next Story

Rashmika Mandanna: కేరళ అడవుల్లో..ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో ర‌ష్మిక మంద‌న్న‌..మైసా కోసం ట‌ఫ్ ఫైట్ సీక్వెన్స్‌..వీడియో వైరల్

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగిపోయింది. అప్ కమింగ్ ప్రాజెక్ట్ మైసా కోసం ఆమె టఫ్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తోంది. కేరళ అడవుల్లో ఈ షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Published on: Apr 26, 2026, 08:11:09 IST
Advertisement

Rashmika Mandanna: డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, బాక్సాఫీస్ ను షేక్ చూస్తూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న దూసుకెళ్తోంది. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు థియేటర్లో అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుల్ యాక్షన్ అవతారంలోకి రష్మిక మారిపోయింది. తన అప్ కమింగ్ మూవీ ‘మైసా’ షూటింగ్ కోసం ఫైట్ సీక్వెన్స్ లో రష్మిక పాల్గొంటుంది.

మైసా షూటింగ్

మైసాలో రష్మిక మందన్న (x/unformulafilms)
మైసాలో రష్మిక మందన్న (x/unformulafilms)

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఇందులో వైలెన్స్ మరో రేంజ్ లో ఉండబోతుందని, రష్మిక మందన్న ఫైట్స్ తో అదరగొట్టబోతుందని అర్థమైంది. ఇప్పుడు మూవీ యూనిట్ కేరళలోని అడవుల్లో హై వోల్టేజీ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తోంది. ఈ మూవీ లో యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది.

ఆ స్టంట్ మాస్టర్

మైసా కోసం పాపులర్ స్టంట్ మాస్టర్ కెచా రంగంలోకి దిగాడు. తుపాకీ, బాహుబలి 2, పొన్నియిన్ సెల్వన్, జవాన్, పుష్ప 2, ఓజీ లాంటి సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన కెచా.. ఇప్పుడు మైసా మూవీకి పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ మైసా ప్రొడ్యూసర్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

‘‘యాక్షన్ లోకి మైసా తిరిగొచ్చింది. కేరళలో 15 రోజుల హై యాక్టేన్ షెడ్యూల్ కొనసాగుతోంది. కెచా మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అత్యంత తీవ్రమైన అవతారంలో తెరలపై మంట పుట్టించేందుకు రష్మిక మందన్న రెడీ అవుతోంది’’ అని అన్ ఫార్ములా ఫిల్మ్స్ ఎక్స్ లో ఓ వీడియో పోస్టు చేసింది.

వీడియో వైరల్

విజయ్ దేవరకొండను ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న రష్మిక మందన్న ఇప్పుడు షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఓ వైపు భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ మూవీ చేస్తోంది రష్మిక. మరోవైపు బాలీవుడ్ లో ‘కాక్ టెయిల్ 2’తో ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు మైసా అంటూ యాక్షన్ కు రెడీ అయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe