...
...
Next Story

Rashmika Mandanna: మా ఆయనతో గడపడానికే ఈ గాయమైందేమో.. పెళ్లి తర్వాత మూడు నెలలు కలుసుకోలేదు: రష్మిక మందన్న

Rashmika Mandanna: రష్మిక మందన్న తన గాయం నుంచి కోలుకొని మళ్లీ మైసా మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె హెచ్‌టీ సిటీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ గాయం వల్ల తాను భర్త విజయ్ తో కలిసి ఉండే టైమ్ దొరికినట్లు చెప్పింది.

Published on: Sep 2, 2026, 19:02:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్‌గా మైసా (Mysaa) సినిమా షూటింగ్ స్పాట్‌లో తీవ్రమైన హిప్ ఇంజురీకి గురయ్యారు. దాదాపు నెలన్నర రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ భామ మళ్లీ హైదరాబాద్‌లో 'రణబాలి' మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి సెట్స్‌లోకి అడుగుపెట్టారు.

కాలు ఎత్తలేని పరిస్థితిలో కూడా షూటింగ్

Rashmika Mandanna: మా ఆయనతో గడపడానికే ఈ గాయమైందేమో.. పెళ్లి తర్వాత మూడు నెలలు కలుసుకోలేదు: రష్మిక మందన్న
Rashmika Mandanna: మా ఆయనతో గడపడానికే ఈ గాయమైందేమో.. పెళ్లి తర్వాత మూడు నెలలు కలుసుకోలేదు: రష్మిక మందన్న

'మైసా' అనే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాంగ్ షూట్ చేస్తుండగా రష్మిక హిప్ బోన్ దగ్గర టెండన్ తెగిపోయింది. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చినట్లు అనిపించినా, నొప్పులను భరిస్తూనే కుడి కాలు పైకి లేపలేని పరిస్థితి వచ్చే వరకు షూట్ కంటిన్యూ చేసినట్లు ఆమె వెల్లడించారు.

మరుసటి రోజు హాస్పిటల్‌కి వెళ్లి ఎంఆర్‌ఐ (MRI) తీయించుకోగా డాక్టర్లు షాక్ అయ్యారు. అంత పెద్ద గాయం పెట్టుకుని నడుచుకుంటూ హాస్పిటల్‌కు రావడం చూసి ఆశ్చర్యపోతూ, పెయిన్ రిసెప్టర్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని హెచ్చరించినట్లు రష్మిక చెప్పారు.

విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తొలిసారి ఇలా..

ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో, ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండను (Vijay Deverakonda) పెళ్లి చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అవ్వడం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఒకరినొకరు కనీసం చూసుకోలేకపోయారు. కానీ ఈ చిన్న గ్యాప్ వాళ్లిద్దరికీ చాలా స్పెషల్ మెమోరీస్‌ను ఇచ్చిందని రష్మిక ఎమోషనల్ అయ్యారు.

రష్మిక రెస్ట్ తీసుకుంటున్న టైమ్‌లో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. "మనమిద్దరం ఇలా ఇంట్లో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగుంది. కానీ నెక్స్ట్ టైమ్ ఇలాంటి క్వాలిటీ టైమ్ గాయాలు లేకుండా దక్కితే ఇంకా బాగుంటుంది" అని ఫన్నీగా కామెంట్ చేశారట.

ఇక రష్మిక రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తూ, పజిల్స్ సాల్వ్ చేస్తూ, మంచి నిద్రను ఎంజాయ్ చేశారు. అయితే త్వరలోనే 'రణబాలి' రిలీజ్ ఉండటం, దాని తర్వాత మరో రెండు సినిమాలు లైన్‌లో ఉండటంతో క్యాలెండర్ డేట్స్ చూస్తుంటే కాస్త టెన్షన్‌గా ఉందని ఆమె అన్నారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో మిగిలిన 10 రోజుల షూటింగ్ పూర్తి చేయడానికి రష్మిక ఫుల్ జోష్‌లో రెడీ అయిపోయారు. మైసా మూవీని నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. ఈ మధ్యే ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక ఓ గోండు యువతిగా చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe