Rashmika Mandanna Osey Ramulamma: తెలుగు వెండితెరపై సీనియర్ నటి విజయశాంతి పేరు తలచుకోగానే అందరి మదిలో మెదిలే మొదటి పాట ‘ఒసేయ్ రాములమ్మ’. 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం, అందులో ఆమె పోషించిన టైటిల్ పాత్ర ఆమె కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మైలురాయిగా నిలిచాయి.
ఒసేయ్ రాములమ్మ రీమిక్స్

సరిగ్గా 29 ఏళ్ల తర్వాత దర్శకుడు రవీంద్ర పుల్లె తన తాజా చిత్రం ‘మైసా’ కోసం ఈ ఒసేయ్ రాములమ్మ పాటను రష్మిక మందన్నపై రీక్రియేట్ చేశారు. ఈ రీమిక్స్ కు అసలైన ప్రత్యేకత ఏంటంటే.. ఒరిజినల్ పాటకు సంగీతం అందించి ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ కొత్త వెర్షన్‌కు ప్రాణం పోయడం. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
పాట అంటే భయమేసింది
ఒసేయ్ రాములమ్మ సాంగ్ ను రీమిక్స్ చేయడంపై రష్మిక మందన్న తన ఫీలింగ్స్ ను షేర్ చేశారు. ‘‘ఒసేయ్ రాములమ్మ పాటను మళ్లీ చేస్తున్నామని దర్శకుడు రవి చెప్పినప్పుడు నిజంగా చాలా భయపడ్డా. ఒక ఐకానిక్ సినిమాలోని అంతటి గొప్ప పాటను రీక్రియేట్ చేయడమనేది పెద్ద బాధ్యత. ఒరిజినల్ పాటను ఎవరూ మ్యాచ్ చేయలేకపోయినా మా వంతు న్యాయం చేశామన్న తృప్తి ఉంది’’ అని రష్మిక మందన్న తెలిపారు.
ఆయన రాకతో ధైర్యం
ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్‌కు రష్మిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో తనకు ఎంతో ధైర్యం కలిగిందని, సమయం కేటాయించి ఈ పాట చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే విజయశాంతి ఈ వేడుకకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని, ఈ పాట ఆమెకు తామిచ్చే చిన్న నివాళి అని రష్మిక భావోద్వేగంగా చెప్పారు.
‘ఒసేయ్ రాములమ్మ’ చరిత్ర..
{{/usCountry}}ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్‌కు రష్మిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో తనకు ఎంతో ధైర్యం కలిగిందని, సమయం కేటాయించి ఈ పాట చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే విజయశాంతి ఈ వేడుకకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని, ఈ పాట ఆమెకు తామిచ్చే చిన్న నివాళి అని రష్మిక భావోద్వేగంగా చెప్పారు.
‘ఒసేయ్ రాములమ్మ’ చరిత్ర..
{{/usCountry}}తెలంగాణలోని ఒక భూస్వామ్య గ్రామ నేపథ్యంలో సాగే ‘ఒసేయ్ రాములమ్మ’ కథ తెలుగు సినిమా చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆధిపత్య కుల భూస్వామి దోపిడీకి గురైన ఒక దళిత మహిళ.. తనను, తన బిడ్డను చంపే ప్రయత్నాల నుంచి నక్సలైట్ల సాయంతో బయటపడి, న్యాయం కోసం పోరాట బాట పట్టే కథే ఈ చిత్రం.
తెలంగాణ పోరాట స్ఫూర్తి, మహిళా సాధికారత, జానపద బాణీలతో కూడిన ఈ ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ భూస్వామ్య వ్యవస్థకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన గీతంగా నిలిచిపోయింది. ఆ రోజుల్లో దాసరి నారాయణరావు, వందేమాతరం శ్రీనివాస్ కలిసి తెలంగాణ మట్టి వాసనతో ఈ సినిమాను అద్భుతంగా మలిచారు.
మైసా కూడా అలాగే
ఇక రష్మిక నటించిన ‘మైసా’ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడే ఒక గోండు గిరిజన మహిళ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తుంటే.. ఈ సినిమా కూడా ‘ఒసేయ్ రాములమ్మ’ తరహాలోనే బలమైన పోరాట అంశాలతో సాగబోతున్నట్లు స్పష్టమవుతోంది.
Featured Video
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.