...
...
Next Story

Rashmika Mandanna: అఫీషియల్.. ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక మందన్న.. బయోపిక్‌పై బిగ్ అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

Rashmika Mandanna: సస్పెన్స్ వీడింది. దిగ్గజ సంగీత విద్వాంసురాలు, భారత రత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. సుబ్బలక్ష్మి పాత్రను రష్మిక మందన్న ప్లే చేయనుంది. ఈ మూవీ పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: Sep 15, 2026, 11:28:48 IST
Advertisement

Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాన నిలిచిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం రష్మిక మందన్నను వరించింది. 'M.S. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆమె సుబ్బులక్ష్మి పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 15) అఫీషియల్ అప్డేట్ వచ్చింది.

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్

అఫీషియల్.. ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక మందన్న.. బయోపిక్‌పై బిగ్ అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే? (x)
అఫీషియల్.. ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక మందన్న.. బయోపిక్‌పై బిగ్ అనౌన్స్‌మెంట్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే? (x)

చాలా కాలంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీలో సుబ్బలక్ష్మి పాత్రను సాయిపల్లవి లేదా రుక్మిణి వసంత్ పోషిస్తుందనే టాక్ కూడా వినిపించింది. కానీ చివరకు రష్మిక మందన్న ఆ రోల్ కు కన్ఫామ్ అయింది.

ఆ డైరెక్టర్

'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ ఎంఎస్ సుబ్బలక్మి బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు. అతను లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ తీసిన సంగతి తెలిసిందే. ఇక రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ ప్రెస్టీజియస్ బయోపిక్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు.

ఎంఎస్- ఎ లెగసీ ఆన్ స్క్రీన్ సినిమాను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, బన్నీ వాసు, కన్నడ అగ్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గీతా ఆర్డ్స్ అనౌన్స్ మెంట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు రేపు (సెప్టెంబర్ 16) వెల్లడి కానున్నాయి.

కమల్ హాసన్ చీఫ్ గెస్ట్

కేవలం సంగీతకారిణిగానే కాకుండా 'సేవాసదనం', 'శాకుంతలై', 'సావిత్రి', క్లాసిక్ 'మీరా' వంటి చిత్రాలలో నటించి వెండితెరపై కూడా తన ముద్ర వేసిన సుబ్బులక్ష్మి ప్రయాణాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు.

రష్మికకు పరీక్ష

కమర్షియల్ ప్రాజెక్ట్‌లతో సౌత్ అండ్ నార్త్‌లలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తున్న రష్మిక మందన్నకు ఈ బయోపిక్ కెరీర్‌లోనే అసలైన పరీక్ష అని చెప్పొచ్చు. 'పుష్ప', 'యానిమల్' వంటి కమర్షియల్ మాస్ హిట్ చిత్రాల తర్వాత ఒక భారతరత్న గ్రహీత, క్లాసికల్ ఐకాన్ పాత్రను పోషించడం ఆమె నటనా సామర్థ్యానికి పెద్ద సవాలు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks