...
...
Next Story

Rashmika Mandanna: అత్తమ్మను ఏడిపించిన రష్మిక మందన్న.. గద్దర్ అవార్డ్స్ లో అఫీషియల్ కోడలిగా ఎమోషనల్ స్పీచ్..వీడియో వైరల్

Rashmika Mandanna: విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న రష్మిక మందన్న తన మాటలతో అత్త మాధవిని ఏడిపించేసింది. తెలంగాణ గద్దర్ మూవీ అవార్డుల్లో రష్మిక స్పీచ్ తో మాధవి ఎమోషనల్ అయ్యార్. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

Published on: Mar 20, 2026, 08:20:43 IST
Advertisement

కొత్త పెళ్లి కూతురు రష్మిక మందన్న మరోసారి వైరల్ గా మారింది. తన మాటలతో అత్త మాధవి దేవరకొండను రష్మిక కన్నీళ్లు పెట్టించింది. తెలంగాణ గద్దర్ మూవీ అవార్డ్స్ 2026 ఈవెంట్ సందర్భంగా ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఉత్తమ నటి రష్మిక

రష్మిక మందన్న మాటలకు అత్త కన్నీళ్లు (x)
రష్మిక మందన్న మాటలకు అత్త కన్నీళ్లు (x)

తెలంగాణ గద్దర్ మూవీ అవార్డుల్లో ఉత్తమ నటి విభాగంలో రష్మిక మందన్న పురస్కారం గెలుచుకుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో యాక్టింగ్ కు గాను ఆమె ఈ అవార్డు సొంతం చేసుకుంది. ఉగాది సందర్భంగా గురువారం (మార్చి 19) రాత్రి హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

అట్రాక్షన్ గా రష్మిక

తెలంగాణ గద్దర్ మూవీ అవార్డ్స్ 2026 ఈవెంట్లో రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన భర్త విజయ్ దేవరకొండ తల్లి మాధవితో కలిసి ఆమె ఈ ఈవెంట్ కు అటెండ్ అయింది. చీరకట్టులో రష్మిక ఎంతో పద్ధతిగా కనిపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఉత్తమ నటి పురస్కారాన్ని రష్మిక అందుకుంది.

ఏడ్చేసిన అత్త

అవార్డు అందుకున్నాక రష్మిక మందన్న తన స్పీచ్ తో అత్త మాధవిని ఏడిపించేసింది. రష్మిక అవార్డు తీసుకునేటప్పుడే మాధవి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ‘నా ఫ్యామిలీని బాగా చూసుకోండి’, ‘పాపలు పార్టీ చేసుకుందాం’ అని రష్మిక అంటుంటే మాధవి ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లను తుడ్చుకుంది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

ట్రోల్ చేశారు

‘‘గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాకు అవార్డు రావడం ఎంతో స్పెషల్. ఇలాంటి సినిమాలు ఇంకా తీసేందుకు ఇది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. రాహుల్ (డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్) లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మూవీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. రష్మిక, భూమా (సినిమాలో రష్మిక క్యారెక్టర్) నిన్ను లవ్ చేస్తూనే ఉంటారు’’ అని రష్మిక చెప్పింది.

అఫీషియల్ కోడలిగా

‘‘నేను కోడలు కాకముందు కూతురిలా ప్రేమ ఇచ్చారు. కానీ ఈ రోజు అఫీషియల్ గా కోడలిగా మీ ముందు నిల్చున్నా. ఇది నాకెంతో గర్వకారణంగా ఉంది. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా. నా ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఇదే నా కోరిక. పాపలు (అత్త మాధవి) నేను సాధించా. ఇక ఇంటికి వెళ్లి పార్టీ చేద్దాం’’ అని రష్మిక స్పీచ్ ముగించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks