రష్మిక మందన్నకు ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. ఆమె నటించిన మూడు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఆ చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉండగా ఓటీటీకి భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించింది శ్రీవల్లి.

ఆమె కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి.. వరుసగా అవకాశాలు దక్కించుకుంది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తొలి చిత్రం చలోతో ఎంట్రీ ఇచ్చి తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లో రష్మిక గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ నటులతో నటించే అవకాశం లభించింది.
కన్నడ, తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలోకి అడుగుపెట్టిన రష్మిక, మలయాళ చిత్రాలలో నటించకపోవడం మినహా, మిగతా అన్ని భాషల్లోని సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. రష్మిక మందన్న విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని తెలుగింటి కోడలు అయింది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో దేవరకొండతో రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత థాయ్‌లాండ్‌కు హనీమూన్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
హీరోయిన్లకు పెళ్లి అయ్యేంత వరకు బిజీగా ఉంటారని, ఆ తర్వాత డిమాండ్ తగ్గుతుందని చెబుతుంటారు. కానీ రష్మిక ఇందుకు భిన్నం. పెళ్లి కాగానే హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోతుందని సినీ పరిశ్రమలో ఒక మాట ఉంది. కానీ రష్మిక విషయంలో ఇది అబద్ధంగా కనిపిస్తుంది. మిసెస్ విజయ్ దేవరకొండకు సినిమా అవకాశాలు అస్సలు తగ్గడం లేదు. ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
విజయ్‌తో పెళ్లి తర్వాత ఈ చూడ చక్కని జంట ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మునుపటి కంటే పది రెట్లు ఎక్కువ షేర్లు, లైక్‌లు వచ్చాయి. రష్మిక ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తల్లోనే ఉంది. రష్మిక చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రణబాలి. ఇందులో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఇది.
{{/usCountry}}విజయ్‌తో పెళ్లి తర్వాత ఈ చూడ చక్కని జంట ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మునుపటి కంటే పది రెట్లు ఎక్కువ షేర్లు, లైక్‌లు వచ్చాయి. రష్మిక ఇప్పటికీ సోషల్ మీడియాలో వార్తల్లోనే ఉంది. రష్మిక చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రణబాలి. ఇందులో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఇది.
{{/usCountry}}రణబాలితో పాటు రష్మిక మైసా అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇది మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా. ఇందులో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది కాకుండా రష్మిక కాక్‌టెయిల్ 2లో కూడా నటిస్తోంది. ఇందులో ఆమెది లెస్బియన్ పాత్ర అని టాక్.
ఈ మూడు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. విశేషం ఏమిటంటే, అవి ఇంకా చిత్రీకరణలో ఉండగానే ఓటీటీ నుండి భారీగా డిమాండ్ ఉంది. భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. రణబాలి, మైసా చిత్రాలను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. కాక్‌టెయిల్ 2 కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుందని అంటున్నారు.