...
...
Next Story

Rashmika Mandanna: ప‌బ్లిక్‌గా ఎఫ్ వ‌ర్డ్ వాడేసిన ర‌ష్మిక మంద‌న్న‌.. కృతి స‌న‌న్ హాట్ అంటూ.. వీడియోలు వైర‌ల్‌

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న పబ్లిక్ గా నోరు జారింది. కాక్ టైల్ మూవీ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ఎఫ్ వర్డ్ వాడేసింది. వెంటనే రియలైజ్ అయిన ఆమె కట్ అంటూ క్యూట్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

Published on: May 18, 2026, 11:28:16 IST
Advertisement

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు నేషనల్ లెవల్లో క్రేజ్ ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ భామ సినిమాలు చేస్తోంది. హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ థామాతో బాలీవుడ్ లో అదరగొట్టిన రష్మిక మందన్న.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ కాక్ టైల్ సీక్వెల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ లాంఛ్ చేశారు.

కాక్ టైల్ 2

రష్మిక మందన్న (x)
రష్మిక మందన్న (x)

రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో కాక్ టైల్ 2 అనే మూవీ చేస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరో. కృతి స‌న‌న్ మరో హీరోయిన్. బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాక్ టైల్ చిత్రానికి సీక్వెల్ గా కాక్ టైల్ 2 రెడీ అవుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సాంగ్ లాంఛ్ ఈవెంట్లో రష్మిక మందన్న ‘ఎఫ్’ వర్డ్ వాడింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

కృతి స‌న‌న్ హాట్

కాక్ టైల్ 2 సాంగ్ లాంఛ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో తన కో స్టార్, మరో హీరోయిన్ కృతి స‌న‌న్ గురించి రష్మిక మందన్న మాట్లాడింది. ‘‘నువ్వు చాలా హాట్. కానీ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. నువ్వు ఫకి** హాట్’’ అని రష్మిక మందన్న చెప్పింది.

నవ్వుతూ

తాను ఎఫ్ వర్డ్ వాడిన విషయాన్ని వెంటనే రష్మిక మందన్న రియలైజ్ అయింది. గట్టిగా నవ్వేసింది. కృతి స‌న‌న్, షాహిద్ కపూర్ కూడా పగలబడి మరీ నవ్వారు. వెంటనే కట్ కట్ అంటూ రష్మిక మందన్న గెస్చర్స్ చేసింది. ఆ వెంటనే కృతి స‌న‌న్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంది.

బిజీ హీరోయిన్

రష్మిక మందన్న ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. వీళ్ల వివాహం ఉదయ్ పూర్ లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించింది. రష్మిక, విజయ్ ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe