...
...
Next Story

Vijay Rashmika Video: రణబాలిలా మారిన రష్మిక మందన్న.. భర్త విజయ్ ముందే డైలాగ్.. నా ఎంట‌ర్‌టైన్మెంట్‌ అంటూ క్యూట్ వీడియో!

Vijay Rashmika Video: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. రష్మిక తన భర్త విజయ్ లాగా యాక్టింగ్ చేస్తూ.. రణబాలి డైలాగ్ చెప్పింది. దానికి విజయ్ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Published on: Oct 3, 2026, 19:37:21 IST
Advertisement

Vijay Rashmika Video: టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali). రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

రణబాలిలా రష్మిక మందన్న

రణబాలిలా మారిన రష్మిక మందన్న.. భర్త విజయ్ ముందే డైలాగ్.. నా ఎంట‌ర్‌టైన్మెంట్‌ అంటూ క్యూట్ వీడియో!
రణబాలిలా మారిన రష్మిక మందన్న.. భర్త విజయ్ ముందే డైలాగ్.. నా ఎంట‌ర్‌టైన్మెంట్‌ అంటూ క్యూట్ వీడియో!

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక బిహైండ్ ది సీన్ (BTS) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 'రణబాలి' చిత్రీకరణ సమయంలో షాట్ల మధ్య లభించిన విరామంలో రష్మిక మందన్న చేసిన వినోదాత్మక చేష్టల వీడియోను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో రణబాలిలా రష్మిక మారింది.

పవర్ ఫుల్ డైలాగ్

రీసెంట్ గా రిలీజైన రణబాలి టీజర్ అదిరిపోయింది. ఇందులో ‘సింగనమల రణబాలి రా నీ యక్క’ అని విజయ్ పవర్ ఫుల్ డైలాగ్ పేలుస్తాడు. ఇప్పుడు రష్మిక కూడా విజయ్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ను అనుకరిస్తూ వీడియో చెప్పింది. తన భర్త ముందుకు వెళ్లి ఈ డైలాగ్ చెప్పింది.

వీడియో వైరల్

రష్మికను "క్యూట్ శావేజ్" (Cute Savage) అని సంబోధించిన విజయ్ తన భార్యపై ప్రశంసలు కురిపించేశాడు. రోజంతా షూటింగ్ లో ఉండే తీవ్రమైన ఒత్తిడి, శ్రమ నుంచి తన మనస్సును ప్రశాంతంగా మార్చే ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సోర్స్ రష్మిక అంటూ ఈ వీడియోను పోస్టు చేశాడు.

1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ వలసపాలన నేపథ్యంలో జరిగే పోరాట కథతో 'రణబాలి' రూపొందుతోంది. గతంలో 'ట్యాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.

రణబాలి, జయమ్మ పాత్రల్లో విజయ్, రష్మికల కెమిస్ట్రీ 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' రోజులను గుర్తుచేస్తోంది. అక్టోబర్ 16న దసరా పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏందయ్య సామి

సినిమా ప్రమోషన్ల విషయంలో కేవలం సాంప్రదాయ ట్రైలర్లు, టీజర్లకే పరిమితం కాకుండా నటీనటుల ఆఫ్‌స్క్రీన్ బాండింగ్, బిహైండ్ ది సీన్స్ విజువల్స్ ఉపయోగించడం ద్వారా డిజిటల్ ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ క్రియేట్ చేయవచ్చు.

విజయ్, రష్మికల సోషల్ మీడియా ఇంటరాక్షన్లు 'రణబాలి' ప్రీ-రిలీజ్ హైప్‌ను తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ‘ఏందయ్య సామి’ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks