Rashmika Vijay: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి మూవీ రణబాలి (Ranabaali). ఈ సినిమా షూటింగ్ రాయలసీమలోనే చాలా వరకు జరిగింది. దీంతో అక్కడి అభిమానులు, ఆ ప్రాంతంతో తమకు ఏర్పడిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్, రష్మిక ఒకేసారి ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.
మా సీమ రాయలసీమ అంటూ..

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ శుక్రవారం (ఏప్రిల్ 3) ఓ చిన్న వీడియోను తమ ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఇద్దరూ రాయలసీమ మై లవ్.. థ్యాంక్యూ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సీమ.. మా సీమ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది.
ఆ తర్వాత రణబాలి షూటింగ్ కోసం విజయ్, రష్మిక రాయలసీమ వెళ్లినప్పుడు అక్కడ వాళ్లకు లభించిన ఘన స్వాగతం, భారీ పూలమాలలు, ర్యాలీలు, దైవ దర్శనాలను ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు రణబాలి షూటింగ్ బిహైండ్ ద సీన్స్ విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి. మళ్లీ ఊరికి వచ్చినట్లుంది అంటూ అక్కడి అభిమానులు ఉద్దేశించి విజయ్ మాట్లాడిన మాటలను కూడా ఈ వీడియోలో చేర్చారు.
రణబాలి మూవీ విశేషాలు
విజయ్, రష్మిక గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఇప్పుడు రణబాలి మూవీలో కలిసి నటిస్తున్నారు. అందులోనూ పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న తొలి మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్యామ్ సింఘరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 1850 నుంచి 70ల మధ్య జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో రణబాలిగా విజయ్, అతని భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్, ఏందయ్య సామి అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రష్మిక పోస్టుకు అర్థమేంటి?
ఇక అంతకుముందు రష్మిక మందన్న మరో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. రష్మిక, విజయ్‌ల యానిమేటెడ్ కార్టూన్లతో కూడిన ఆ వీడియోకు "Now it’s us three" అనే క్యాప్షన్ ఉండటంతో.. రష్మిక గర్భవతి ఏమో అని అందరూ భావించారు.
{{/usCountry}}ఇక అంతకుముందు రష్మిక మందన్న మరో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. రష్మిక, విజయ్‌ల యానిమేటెడ్ కార్టూన్లతో కూడిన ఆ వీడియోకు "Now it’s us three" అనే క్యాప్షన్ ఉండటంతో.. రష్మిక గర్భవతి ఏమో అని అందరూ భావించారు.
{{/usCountry}}రష్మిక పోస్ట్ చేసిన ఆ వీడియో వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రెగ్నెన్సీ కాదని ఇప్పుడు స్పష్టమైంది. ఇది 'టెర్రిబ్లీ టైని టేల్స్' (Terribly Tiny Tales) సంస్థతో కలిసి వారు చేస్తున్న ఒక కొత్త డిజిటల్ ప్రాజెక్ట్ కావడం విశేషం. రష్మిక క్యారెక్టర్ ఆధారంగా సృష్టించిన 'Ru' (రూ) అనే యానిమేటెడ్ క్యారెక్టర్‌ను విజయ్ దేవరకొండతో కలిపి 'Rashmika & Ru' అనే ఆనిమేటెడ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సిరీస్‌లో రష్మిక, విజయ్‌లతో పాటు 'రూ' అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది కాబట్టే ఆమె "Us Three" (మేము ముగ్గురం) అని పేర్కొంది.