Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి రోజున రష్మిక మేకప్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.

సాధారణంగా సెలబ్రిటీ పెళ్లిళ్లంటే గంటల తరబడి మేకప్, భారీ నగలతో హంగామా ఉంటుంది. కానీ రష్మిక మాత్రం చాలా సింపుల్‌గా, సహజంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మసూమ్ మినవాలా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రష్మిక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఈ 'మినిమల్ లుక్' వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టారు.
మేకప్ కోసం కేవలం గంటన్నర సమయం
తన్వీ గత నాలుగేళ్లుగా రష్మికతో కలిసి పనిచేస్తున్నారు. పెళ్లి రోజున మేకప్ కోసం రష్మిక కేవలం 90 నిమిషాలు (గంటన్నర) మాత్రమే సమయం కేటాయించారని తన్వీ వెల్లడించారు.
"పెళ్లికి ముందు రోజు రాత్రి కూడా ఒక ఈవెంట్ ఉండటంతో రష్మిక సరిగ్గా నిద్రపోలేదు. చాలా బిజీ షెడ్యూల్ వల్ల ఆమె అసలు సమయానికి రాలేకపోయారు. వచ్చిన వెంటనే.. 'మీకు కేవలం 40 నిమిషాలే టైమ్ ఉంది, నన్ను రెడీ చేయండి' అని కండిషన్ పెట్టారు. కానీ మేమంతా కలిసి ఒక గంటన్నరలో పూర్తి అలంకరణ ముగించాం" అని తన్వీ గుర్తు చేసుకున్నారు.
"కాటుక కూడా వద్దు" - రష్మిక స్పష్టత
పెళ్లి రోజున భారీ అలంకరణ వద్దని రష్మిక ముందే కచ్చితంగా చెప్పారట. "తను ఎలా ఉంటుందో, అలాగే సహజంగా కనిపించాలని రష్మిక కోరుకున్నారు. కనీసం కళ్ళకు కాటుక కూడా పెట్టొద్దని ఆమె అడిగినప్పుడు నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద సెలబ్రిటీ పెళ్లిలో ఇంత సింపుల్ లుక్ వర్కవుట్ అవుతుందా? అని సందేహించాను. కానీ రష్మికకు తన లుక్ మీద పూర్తి స్పష్టత ఉంది. ఆ సహజత్వమే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు తెచ్చిపెట్టింది" అని తన్వీ వివరించారు. పెళ్లి పీటల మీదకు వెళ్లేటప్పుడు రష్మిక ముఖంలో కనిపించిన ఆనందమే ఆమెకు అసలైన అందాన్ని ఇచ్చిందని తన్వీ పేర్కొన్నారు.
సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ నుంచి గ్రాండ్ రిసెప్షన్ వరకు
విజయ్, రష్మిక చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినా, వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. గతేడాది సెప్టెంబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి వార్తను ధృవీకరించారు. ఉదయ్‌పూర్ వివాహం అనంతరం మార్చిలో హైదరాబాద్‌లో ఇండస్ట్రీ మిత్రుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించారు.
{{/usCountry}}విజయ్, రష్మిక చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినా, వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. గతేడాది సెప్టెంబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి వార్తను ధృవీకరించారు. ఉదయ్‌పూర్ వివాహం అనంతరం మార్చిలో హైదరాబాద్‌లో ఇండస్ట్రీ మిత్రుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించారు.
{{/usCountry}}ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, కృతి సనన్, కరణ్ జోహార్ వంటి అగ్ర ప్రముఖులు హాజరయ్యారు. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మీట్-అండ్-గ్రీట్ నిర్వహించి, స్వయంగా వారే భోజనాలు వడ్డించడం విశేషం.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల ద్వారా వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట.. ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటవ్వడం పట్ల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. వారి పెళ్లి ఫోటోలు ఆసియాలోనే అత్యధిక లైకులు పొందిన ఫోటోలుగా రికార్డు సృష్టించడం ఈ 'నేచురల్ లుక్' పవర్ ఏంటో నిరూపిస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఎక్కడ జరిగింది?
వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ (ITC మొమెంటోస్) వేదికగా ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది.
2. రష్మిక మేకప్ ఆర్టిస్ట్ ఎవరు?
ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్. ఈమె గత నాలుగేళ్లుగా రష్మికతో కలిసి పనిచేస్తున్నారు.
3. పెళ్లి రోజు రష్మిక ప్రత్యేకత ఏమిటి?
సాధారణ బ్రైడల్ మేకప్‌కు భిన్నంగా రష్మిక 'మినిమల్ లుక్'ను ఎంచుకున్నారు. కేవలం 90 నిమిషాల్లోనే హెయిర్, మేకప్, స్టైలింగ్ పూర్తి చేసుకున్నారు.