థామాలో బేతాళిగా రక్త పిశాచుల చీకటి ప్రపంచాన్ని చూపించిన తర్వాత.. రష్మిక మందన్న ఇప్పుడు ప్రేమ, గందరగోళం, భావోద్వేగాలతో నిండిన పూర్తి భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఆమె రాబోయే చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ ఇవాళ (అక్టోబర్ 25) విడుదలైంది. ఇది ఒక చిక్కుముడితో కూడిన ప్రేమకథను పరిచయం చేస్తుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్

'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్‌ను చిత్ర నిర్మాతలు శనివారం విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అను ఇమ్మాన్యుయేల్ మెరిసింది. ఇందులో రష్మిక పాత్ర ఒక గందరగోళ ప్రశ్నతో పోరాడుతుంది. ఆమె నిజంగా తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమిస్తోందా లేక ప్రేమ అనే భావనను మాత్రమే ప్రేమిస్తోందా? అనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
చిన్న బ్రేక్
ట్రైలర్ ప్రారంభంలో రష్మిక పాత్ర భూమా తన బాయ్‌ఫ్రెండ్ విక్రమ్‌తో "ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం" అని కంగారుగా అడుగుతుంది. అది కేవలం విరామం కాదని, నిజమైన బ్రేకప్ అని ఆమె స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ఆమెకు మొదటిసారి ప్రపోజ్ చేసిన సన్నివేశం కనిపిస్తుంది. "ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది. పెళ్లి చేసుకుందాం" అని అతను అంటాడు. భూమా తనకు సరైన భాగస్వామి అని విక్రమ్ నమ్మకంతో ఉండగా, భూమా మాత్రం అదే విషయంపై అనిశ్చితితో ఉంటుంది.
రొమాన్స్, కిస్
ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ ప్రారంభంలో రష్మిక, దీక్షిత్ శెట్టి మధ్య గాఢమైన ప్రేమను చూపించారు. చిలిపి నవ్వులు, రొమాన్స్, కిస్ సీన్లున్నాయి. "నిన్న రాత్రి విక్రమ్ కు ముద్దు పెట్టావా?’’ వంటి సరదా సంభాషణలు, ఆటపట్టించే సన్నివేశాలతో వారిద్దరూ ప్రేమలో మునిగిపోయిన జంటగా కనిపిస్తారు. అయితే, వెంటనే కథనం ఉద్రిక్తమైన వాదనలు, విభేదాలు, కుటుంబ కలహాలు, కోపం, సందేహాలతో మరింత సంక్లిష్టంగా మారుతుంది.
అను ఇమ్మాన్యుయేల్
ట్రైలర్ లో అను ఇమ్మాన్యుయేల్ మెరిసింది. విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమె నటించింది. ‘నువ్వు విక్రమ్ కు కరెక్ట్ కానీ అతను నీకు కరెక్ట్ కాదు’ అని రష్మిక క్యారెక్టర్ తో అను డైలాగ్ చెప్తోంది. రష్మిక తండ్రిగా రావు రమేష్ నటించారు. ఇంత వరస్ట్ కూతురివి ఏంటీ అంటూ కోపం చూపిస్తాడు. మరోవైపు హీరో ఇందులో క్రికెటర్ కూడా. ‘నేను విరాట్ కోహ్లీరా, అక్కడ నా అనుష్క ఉంది’ అంటాడు. చివరికి రష్మిక పాత్ర తన సంబంధాన్ని, అలాగే 'గర్ల్‌ఫ్రెండ్' అనే ట్యాగ్‌ను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజ్ డేట్
{{/usCountry}}ట్రైలర్ లో అను ఇమ్మాన్యుయేల్ మెరిసింది. విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమె నటించింది. ‘నువ్వు విక్రమ్ కు కరెక్ట్ కానీ అతను నీకు కరెక్ట్ కాదు’ అని రష్మిక క్యారెక్టర్ తో అను డైలాగ్ చెప్తోంది. రష్మిక తండ్రిగా రావు రమేష్ నటించారు. ఇంత వరస్ట్ కూతురివి ఏంటీ అంటూ కోపం చూపిస్తాడు. మరోవైపు హీరో ఇందులో క్రికెటర్ కూడా. ‘నేను విరాట్ కోహ్లీరా, అక్కడ నా అనుష్క ఉంది’ అంటాడు. చివరికి రష్మిక పాత్ర తన సంబంధాన్ని, అలాగే 'గర్ల్‌ఫ్రెండ్' అనే ట్యాగ్‌ను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజ్ డేట్
{{/usCountry}}ఈ చిత్రానికి రాహుల్ కథ, దర్శకత్వం అందించారు. ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు.హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఈ సినిమా టీజర్ విడుదలైంది. రష్మిక లగేజీతో కాలేజీలోకి ప్రవేశించే విజువల్స్‌తో పాటు, కథానాయిక అందాన్ని ప్రశంసిస్తూ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఆ టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.