టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు హైదరాబాద్ రిసెప్షన్‌తో ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట.. బుధవారం (మార్చి 4) సినీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మెరిసిపోయారు. ఈ ఇద్దరి డ్రెస్సింగ్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
సాంప్రదాయ దుస్తుల్లో కొత్త దంపతులు

రిసెప్షన్ వేడుక కోసం రష్మిక ఎరుపు, బంగారు రంగు కలగలిసిన పట్టుచీరలో అచ్చమైన తెలుగింటి కోడలిలా మెరిసిపోగా.. విజయ్ క్రీమ్ కలర్ కుర్తా, ధోతీ, భుజంపై కండువాతో రాయల్ లుక్‌లో కనిపించాడు. వేదిక వద్దకు రాగానే ఈ జంట కెమెరాలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. ఈ క్రమంలో పాపరాజీలతో విజయ్ మాట్లాడుతూ.. "ఈ రోజుతో ఈ వేడుకలను ముగించి, కాస్త ప్రశాంతత కోసం అండర్ గ్రౌండ్ (ఏకాంతం)లోకి వెళ్లాలనుకుంటున్నాం" అని సరదాగా వ్యాఖ్యానించాడు. విజయ్ మాటలకు రష్మికతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయాడు.
తరలివచ్చిన సినీ దిగ్గజాలు
రష్మిక, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ పెద్దలంతా తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, దగ్గుబాటి వెంకటేష్, నాగార్జున తన భార్య అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి వచ్చారు.
అలాగే నేచురల్ స్టార్ నాని, నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి హాజరయ్యారు. వీరితో పాటు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, శరత్‌కుమార్, దర్శకుడు సుకుమార్, నవీన్ పొలిశెట్టి, దీక్షిత్ శెట్టి, బాలీవుడ్ నటి నీనా గుప్త కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
ప్రైవేట్ వెడ్డింగ్ నుంచి పబ్లిక్ సెలబ్రేషన్ వరకు
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల ద్వారా దగ్గరైన ఈ జంట, తమ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు అత్యంత సీక్రెట్ గా ఉంచారు. ఉదయ్‌పూర్‌లోని ఆరావళి కొండల నడుమ ఒక లగ్జరీ హోటల్లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరుసగా ఆలయాల సందర్శన, సొంతూరికి వెళ్లి వ్రతాలు పూర్తి చేసుకున్న ఈ జంట.. రిసెప్షన్‌తో ఈ వేడుకలకు ముగింపు పలికారు. అంతేకాదు పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు.
సెప్టెంబర్‌లో మళ్ళీ వెండితెరపై..
{{/usCountry}}గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల ద్వారా దగ్గరైన ఈ జంట, తమ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు అత్యంత సీక్రెట్ గా ఉంచారు. ఉదయ్‌పూర్‌లోని ఆరావళి కొండల నడుమ ఒక లగ్జరీ హోటల్లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరుసగా ఆలయాల సందర్శన, సొంతూరికి వెళ్లి వ్రతాలు పూర్తి చేసుకున్న ఈ జంట.. రిసెప్షన్‌తో ఈ వేడుకలకు ముగింపు పలికారు. అంతేకాదు పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు.
సెప్టెంబర్‌లో మళ్ళీ వెండితెరపై..
{{/usCountry}}నిజ జీవితంలో ఒక్కటైన విజయ్ - రష్మికలు త్వరలోనే వెండితెరపై కూడా జంటగా కనిపించనున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే పీరియడ్ డ్రామాలో వారు నటిస్తున్నారు. ఇందులో విజయ్ 'రణబాలి'గా, రష్మిక 'జయమ్మ'గా అలరించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.