మన శంకర వరప్రసాద్ గారు అంటూ ఈ సంక్రాంతికి థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి చిరంజీవి వచ్చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రివ్యూలు, రేటింగ్ ఇవ్వకుండా టికెటింగ్ ఫ్లాట్ ఫామ్ బ్లాక్ చేసేలా కోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు బుక్ మై షో లాంటి ప్లాట్ ఫామ్ లో అది అమలు అవుతోంది. దీనిపై విజయ్ దేవరకొండ సంతోషం, బాధ వ్యక్తం చేశాడు.
విజయ్ దేవరకొండ పోస్ట్

చాలా సంవత్సరాలుగా ఈ వ్యవస్థీకృత దాడుల సమస్యను తాను లేవనెత్తుతున్నానని, కానీ ఎవరూ తన మాట వినిపించుకోలేదని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఆదివారం (జనవరి 11) తన ఎక్స్ ఖాతాలో.. ఒక సినిమాకు రేటింగ్స్ నిలిపివేయడం పరిశ్రమలో ఇదే మొదటిసారి అని పేర్కొంటూ ఒక స్క్రీన్‌షాట్‌ను విజయ్ పంచుకున్నారు.
సంతోషం, బాధ
‘‘దీన్ని చూసి సంతోషంగానూ, బాధగానూ ఉంది. చాలా మంది కష్టాలు, కలలు, డబ్బుకు ఏదో ఒక విధంగా రక్షణ ఉంటుందని తెలుసుకుని సంతోషంగా ఉంది. అదే సమయంలో మన సొంత వాళ్ళే ఈ సమస్యలను సృష్టిస్తున్నారనే వాస్తవం బాధాకరం. 'బతుకుతూ, బతకనివ్వు' అనే భావన, కలిసి ఎదగడం ఎక్కడికి పోయాయి?'’’ అని విజయ్ దేవరకొండ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
చెవిటి వాళ్లకు
“డియర్ కామ్రేడ్ రోజుల నుంచే వ్యవస్థీకృత దాడుల షాకింగ్ రాజకీయాలను నేను మొదటిసారిగా చూడటం ప్రారంభించా. ఇన్నేళ్లు నా గొంతును చెవిటివాళ్లకు వినిపించినట్లయింది. ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకు చెప్పారు. ఆ తర్వాత నాతో సినిమా తీసిన ప్రతి నిర్మాత, దర్శకుడు త్వరలోనే సమస్య స్థాయిని గ్రహిస్తారు. ఇలాంటి పనులు ఎలాంటి వ్యక్తులు చేస్తారు? నా కలలను, నా తర్వాత వచ్చేవారి కలలను రక్షించుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలి అని నిద్రలేని రాత్రులు గడిపా’’ అని విజయ్ దేవరకొండ తన పోస్ట్ లో కొనసాగించాడు.
పూర్తి పరిష్కారం కాదు
{{/usCountry}}“డియర్ కామ్రేడ్ రోజుల నుంచే వ్యవస్థీకృత దాడుల షాకింగ్ రాజకీయాలను నేను మొదటిసారిగా చూడటం ప్రారంభించా. ఇన్నేళ్లు నా గొంతును చెవిటివాళ్లకు వినిపించినట్లయింది. ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకు చెప్పారు. ఆ తర్వాత నాతో సినిమా తీసిన ప్రతి నిర్మాత, దర్శకుడు త్వరలోనే సమస్య స్థాయిని గ్రహిస్తారు. ఇలాంటి పనులు ఎలాంటి వ్యక్తులు చేస్తారు? నా కలలను, నా తర్వాత వచ్చేవారి కలలను రక్షించుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలి అని నిద్రలేని రాత్రులు గడిపా’’ అని విజయ్ దేవరకొండ తన పోస్ట్ లో కొనసాగించాడు.
పూర్తి పరిష్కారం కాదు
{{/usCountry}}"ఇప్పుడు ఇది బహిరంగంగా వెలుగులోకి రావడం, మెగాస్టార్ వంటి పెద్ద, శక్తివంతమైన వ్యక్తి నటించిన సినిమాలకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించడం నాకు సంతోషాన్నిచ్చింది. ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించదు కానీ ఆందోళన చెందాల్సిన విషయాలలో ఒకటి తగ్గుతుంది. ప్రస్తుతానికి మన శంకర వరప్రసాద్ గారు, ఇతర సంక్రాంతి చిత్రాలు సెలవుల్లో మనందరినీ అలరించడం ద్వారా అత్యంత విజయవంతం అవ్వాలని కోరుకుందాం" అని విజయ్ ముగించాడు.
కోర్టు ఆర్డర్స్
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుక్ మై షో పేజీ ప్రకారం కోర్టు ఉత్తర్వుల కారణంగా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్ ఇవ్వకుండా బ్లాక్ చేశారు. ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదలవుతుంది.