...
...
Next Story

మహేష్ బాబు అన్న కొడుకుతో రవీనా టండన్ అమ్మాయి.. క్రేజీ కాంబినేషన్ తెలుగు డెబ్యూ

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ ఘట్టమనేని, రాషా థడాని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ క్రేజీ కాంబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Nov 18, 2025, 05:42:03 IST
Advertisement

దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రేమకథ.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రాషా థడానిలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది. రాషా థడాని జయకృష్ణ ఘట్టమనేనితో కలిసి తెలుగులో అరంగేట్రం చేయనుంది.

గ్రాండ్ ఎంట్రీ

జయకృష్ణ ఘట్టమనేనితో రషా థఢాని మూవీ
జయకృష్ణ ఘట్టమనేనితో రషా థఢాని మూవీ

మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు అయిన జయకృష్ణ టాలీవుడ్‌లో తన గ్రాండ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. నవంబర్ 9న అజయ్ భూపతి అధికారికంగా తాను ఈ యువ నటుడి తొలి చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో “ఒక గొప్ప కథతో పాటు గొప్ప బాధ్యత వస్తుంది. నా తదుపరి చిత్రం ద్వారా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేయడానికి చాలా సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను. కొండల లోతుల నుండి, ఒక సహజమైన, తీవ్రమైన, వాస్తవిక ప్రేమకథ, ఏబీ4 టైటిల్ ప్రకటన త్వరలో” అని అజయ్ వెల్లడించాడు.

అందమైన రాషా

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ అధినేత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, జెమిని కిరణ్ చందమామ కథా పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఆర్ఎక్స్ 100తో

అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 అనే వివాదాస్పద చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత హిందీలో ‘తడప్’గా రీమేక్ అయింది ఈ మూవీ. అతను తన స్నేహితుడి ప్రేమకథ ఆధారంగా ఈ చిత్ర కథను రాశారు. ఇందులో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలు పోషించారు. 2021లో అతను శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలలో నటించిన ‘మహా సముద్రం’ను దర్శకత్వం వహించారు.

2023లో పాయల్ నటించిన అతని చిత్రం ‘మంగళవారం’ అదరగొట్టింది. నింఫోమానియా అనే కాన్సెప్ట్‌ను అన్వేషించడం వల్ల వార్తల్లో నిలిచింది. రాషా ఈ సంవత్సరం జనవరిలో హిందీ చిత్రం ‘ఆజాద్’తో వెండితెరపై అరంగేట్రం చేసింది. ఇందులో అజయ్ దేవ్‌గన్ మేనల్లుడు ఆమన్ దేవ్‌గన్ ఆమె సహనటుడిగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe