Dog Attacks Raveena Tandon: బాలీవుడ్ ప్రముఖ నటి, తెలుగు-హిందీ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌కు ముంబైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి నటించిన 'ఓ మై డాగ్' (Ohh My Dog) ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆమె, రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
కరవబోయిన కుక్క

ఈ సందర్భంగా ఓ మై డాగ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన కుక్కతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు రవీనా టాండన్. అయితే ఉన్నట్టుండి ఆ కుక్క ఒక్కసారిగా రవీనా టాండన్‌ను కరిచేందుకు ప్రయత్నించింది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
భయపడకుండా ఓపికతో లాలించిన రవీనా
ఈ వీడియోలో స్టేజీ మీద ఫొటోల కోసం కిందకు వంగిన రవీనా పైకి లేస్తుండగా, ఆ శునకం తీవ్రంగా మొరుగుతూ ఆమెను కరవబోయింది. ఈ క్రమంలో రవీనా వేసుకున్న డ్రెస్ దారాలు ఆ కుక్క నోటికి చిక్కుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా భయంతో కేకలు వేయడం లేదా వెనక్కి పరుగెత్తడం చేస్తారు. కానీ, రవీనా మాత్రం ఏమాత్రం కూడా భయపడలేదు. ఎంతో ప్రశాంతంగా ఆ కుక్కను నిమురుతూ దానిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
రవీనాపై ప్రశంసల వర్షం
"ఇంత హడావుడి, లైట్ల మధ్య కుక్క ఒత్తిడికి గురై ఉంటుంది. రవీనా టాండన్ మేడమ్ ఎంతో ఓపికతో, దయతో పరిస్థితిని చక్కదిద్దారు. నిజమైన జంతు ప్రేమికులకు ఉండాల్సిన లక్షణం ఇది" అని నెటిజన్లు సోషల్ మీడియాలో రవీనాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"మన దగ్గర సినిమా ఈవెంట్లలో స్టార్లకు ఏ చిన్న సమస్య వచ్చినా బాడీగార్డులు, అభిమానుల తోపులాటతో గందరగోళం నెలకొంటుంది. అలాంటిది అంతపెద్ద స్టార్ అయ్యుండి కూడా రవీనా చూపించిన సంయమనం అందరినీ ఆకట్టుకుంది" అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
జంతువులపై ప్రేమాభిమానాలను చాటే 'ఓ మై డాగ్'
{{/usCountry}}"మన దగ్గర సినిమా ఈవెంట్లలో స్టార్లకు ఏ చిన్న సమస్య వచ్చినా బాడీగార్డులు, అభిమానుల తోపులాటతో గందరగోళం నెలకొంటుంది. అలాంటిది అంతపెద్ద స్టార్ అయ్యుండి కూడా రవీనా చూపించిన సంయమనం అందరినీ ఆకట్టుకుంది" అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
జంతువులపై ప్రేమాభిమానాలను చాటే 'ఓ మై డాగ్'
{{/usCountry}}అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్' ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఓ ప్రాంతంలో వరుసగా మాయమవుతున్న కుక్కల వెనుక ఉన్న ఒక పెద్ద ముఠా గుట్టును ఒక ధైర్యవంతమైన కుక్క ఎలా రట్టు చేసిందనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. పంకజ్ త్రిపాఠితో పాటు పవన్ మల్హోత్రా, మాహి రాయ్, రాజేష్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సినిమాపై దర్శకుడి కామెంట్స్
"కుక్కలు మనకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమను, విశ్వాసాన్ని అందిస్తాయి. జంతువుల పట్ల దయతో మెలగాలనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించాం. థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రేక్షకులు జంతువుల పట్ల కాస్త ప్రేమను పెంచుకుంటే మా ప్రయత్నం నెరవేరినట్లే" అని దర్శకుడు అమిత్ రాయ్ పేర్కొన్నారు.
ఇవాళే థియేటర్లలోకి
బాబులాల్ బయోస్కోప్, థింకింగ్ హ్యాట్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అమిత్ రాయ్, రాజేష్ భరద్వాజ్, సనా వార్సీ నిర్మించిన ఈ ఓ మై డాగ్ సినిమా ఆగస్టు 7న అంటే ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
ఓ మై డాగ్ వాయిదా
థియేటర్లు దొరక్కపోవడం, ఇతర పెద్ద సినిమాల పోటీ కారణంగా జూలై 31 నుంచి ఆగస్టు 7కి ఈ సినిమా ఓ మై డాగ్ విడుదలను వాయిదా వేశారు.