...
...
Next Story

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. వచ్చే వారమే అంటూ సోషల్ మీడియాలో బజ్

రవితేజ నటించిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా మరో బజ్ నెలకొంది. ఈ మూవీ విషయంలో జీ5 ఓటీటీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. ఇప్పుడు కొత్తగా మరో తేదీ తెరపైకి వచ్చింది.

Published on: Feb 14, 2026, 11:25:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో అంతంతమాత్రం వసూళ్లు సాధించిన ఏకైక మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీయే ఓటీటీలోకి మొదటగా వస్తుందని భావించినా ఇప్పటి వరకూ రాలేదు. మిగిలిన నాలుగు మూవీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 13నే వస్తుందని భావించిన ఈ మూవీపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు.

ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా?

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. వచ్చే వారమే అంటూ సోషల్ మీడియాలో బజ్
రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా.. వచ్చే వారమే అంటూ సోషల్ మీడియాలో బజ్

అయితే తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై మరో బజ్ నెలకొంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ఇదే కన్ఫమ్ అన్నట్లుగా చెబుతున్నారు.

ఇదే జీ5 ఓటీటీలోకి ఫిబ్రవరి 11న మన శంకరవరప్రసాద్ గారు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా రికార్డులు తిరగరాస్తోంది. సరిగ్గా ఇదే కారణంతోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ డిజిటల్ ప్రీమియర్ ను జీ5 వాయిదా వేసిందని గతంలో వార్తలు వచ్చాయి.

రెండు పెద్ద సినిమాలను ఒకేసారి తీసుకురావడం వల్ల వ్యూస్ డివైడ్ అయ్యే అవకాశం ఉండటంతో రవితేజ సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు 20వ తేదీకి తీసుకురావడం వల్ల రెండు సినిమాలకు తగినంత గ్యాప్ ఉండబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విశేషాలు

సంక్రాంతి 2026 కానుకగా జనవరి 13న విడుదలైన రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కనపెట్టి చేసిన ఈ సినిమా ఓ రకంగా అతని డిజాస్టర్లకు బ్రేక్ వేసింది. కానీ ఆశించిన విజయం మాత్రం ఇవ్వలేకపోయింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks