వరుస ఫ్లాప్ లకు చెక్ పెట్టేందుకు, మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు రవితేజ రూట్ మార్చాడు. తనకు మాస్ ఇమేజీని తెచ్చిన మాస్ మహారాజ్ ట్యాగ్ ను కూడా పక్కనపెట్టేశాడు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
మాస్ మహారాజ్ కాదు

సాధారణంగా రవితేజను మాస్ మహారాజ్ అని పిలుస్తారు. సినిమా టైటిల్స్ లోనూ ఈ ట్యాగ్ వేస్తారు. తన యాక్టింగ్ తో, మాస్ సినిమాలతో అతను ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కోసం మాస్ మహారాజ్ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పాడంటా. ఈ విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించాడు.
రూట్ మార్చి
మాస్ మహారాజ్ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వరుసగా మాస్ సినిమాలతో ఫ్లాప్ లు మూటగట్టుకున్నాడు రవితేజ. మరొకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా పూర్తిగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. అందుకే ఆ ట్యాగ్ వద్దన్నాడని అంటున్నారు. ఈ మార్పు కలిసొచ్చి రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కితే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
టికెట్ రేట్లు
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పుడు ఏ పెద్ద హీరో సినిమా రిలీజైన టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉండదని మేకర్స్ క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఇటీవల టికెట్ రేట్ల పెంపు కోసమని తమ దగ్గరకు రావొద్దని రేవంత్ రెడ్డి సర్కారులోని మంత్రులు అంటున్నారు. మరోవైపు రవితేజకు కూడా హిట్ కావాలి. అందుకే టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిసింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టోరీ
భర్త మహాశయులకు విజ్ఞప్తి పూర్తిగా కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ భార్య డింపుల్ హయాతి. రవితేజ ఏహో ఆషికా రంగనాథన్ తో సంబంధం పెట్టుకుంటాడు.
{{/usCountry}}భర్త మహాశయులకు విజ్ఞప్తి పూర్తిగా కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ భార్య డింపుల్ హయాతి. రవితేజ ఏహో ఆషికా రంగనాథన్ తో సంబంధం పెట్టుకుంటాడు.
{{/usCountry}}తన ప్రియురాలి విషయం భార్యకు తెలియకుండా, మోసం చేస్తున్నామోననే బాధలో రవితేజ ఉంటాడు. మరోవైపు భర్తను పూర్తిగా నమ్ముతుంది భార్య. ఇక ఆషికాకు రవితేజ భార్య విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి.