Ravi Teja Irumudi 2 Days Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఇరుముడి'. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా, రెండో రోజు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం

ట్రేడ్ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2,943 షోలలో ప్రదర్శితమైన ఇరుముడి చిత్రం రెండో రోజు రూ. 16.10 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి భారతీయ బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' మొత్తం రూ. 31.40 కోట్ల నికర వసూళ్లను సాధించి సత్తా చాటింది.
తెలుగు వెర్షన్‌కే ఎక్కువ
అలాగే, రూ. 36.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో అత్యధిక వాటా తెలుగు వెర్షన్ నుంచే రావడం విశేషం. తెలుగు వెర్షన్ ద్వారా రూ. 31.34 కోట్లు రాగా, తమిళ వెర్షన్ నుంచి రూ. 0.06 కోట్లు వసూలయ్యాయి.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఏకంగా 78.54 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఇరుముడి సినిమా. ఉదయం షోలకు 63.00 శాతంతో ప్రారంభమైన ఆక్యుపెన్సీ, మధ్యాహ్నానికి 80.00 శాతానికి, సాయంత్రానికి 82.85 శాతానికి పెరిగింది.
థియేటర్లు హౌస్‌ఫుల్
ఇక నైట్ షోలలో ఏకంగా 88.31 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. వారాంతం కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓవర్సీస్‌లోనూ రవితేజ హవా
ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ రవితేజ తన మాస్ పవర్‌ను నిరూపించుకుంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో రెండో రోజు రూ. 5.00 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, అక్కడ మొత్తం రూ. 11 కోట్ల గ్రాస్ మార్కును తాకింది. దీనితో కలిపి 'ఇరుముడి' ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు కేవలం రెండు రోజుల్లోనే రూ. 47.45 కోట్లకు చేరుకున్నాయి.
ఇరుముడి థియేట్రికల్ బిజినెస్
{{/usCountry}}ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ రవితేజ తన మాస్ పవర్‌ను నిరూపించుకుంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో రెండో రోజు రూ. 5.00 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, అక్కడ మొత్తం రూ. 11 కోట్ల గ్రాస్ మార్కును తాకింది. దీనితో కలిపి 'ఇరుముడి' ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు కేవలం రెండు రోజుల్లోనే రూ. 47.45 కోట్లకు చేరుకున్నాయి.
ఇరుముడి థియేట్రికల్ బిజినెస్
{{/usCountry}}అయితే, మీసాలోడి ఇరుముడి సినిమాకు వరల్డ్ వైడ్‌గా సుమారుగా రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన ఇరుముడి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపుగా రూ. 21 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్
అయితే, ఇరుముడి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 47.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి, ఈ లెక్కన 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సునాయసంగా దాటేసింది ఇరుముడి సినిమా. ఇలా రెండ్రోజుల్లోనే ఇరుముడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
ఇరుముడి హిట్‌కి కారణాలు
ఇదిలా ఉంటే, ఇరుముడి సినిమాలో రవితేజ నటనతో పాటు బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తమ పాత్రల్లో ఒదిగిపోయారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడతారని 'ఇరుముడి' వసూళ్లు మరోసారి రుజువు చేస్తున్నాయి.