Irumudi OTT: బిగ్ స్క్రీన్లు రెడీ చేసుకోండి.. స‌బ్‌స్క్రిప్ష‌న్ చెక్ చేసుకోండి.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఇరుముడి!

Irumudi OTT: థియేటర్లలో ఫ్యామిలీలకు ఫ్యామిలీలు వెళ్లి చూసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇరుముడి. రవితేజ నటించిన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. 

Published on: Sep 9, 2026, 10:18:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi OTT: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. థియేటర్లలో అదరగొట్టిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

బిగ్ స్క్రీన్లు రెడీ చేసుకోండి.. స‌బ్‌స్క్రిప్ష‌న్ చెక్ చేసుకోండి.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఇరుముడి! (x/MythriOfficial)
బిగ్ స్క్రీన్లు రెడీ చేసుకోండి.. స‌బ్‌స్క్రిప్ష‌న్ చెక్ చేసుకోండి.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఇరుముడి! (x/MythriOfficial)

రూ.200 కోట్ల ఇరుముడి

'మజిలీ', 'నిన్ను కోరి' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి థియేటర్లలో విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన పబ్లిక్ టాక్‌తో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.

రవితేజ యాక్టింగ్

​బాక్సాఫీస్ వద్ద పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ 'ఇరుముడి' సుదీర్ఘ కాలం పాటు థియేటర్లలో స్థిరమైన వసూళ్లను రాబట్టింది. రవితేజ అనగానే కేవలం మాస్, కామెడీ చిత్రాలే అనుకునే సమయంలో.. శివ నిర్వాణ ఆయనలోని పవర్‌ఫుల్ ఎమోషనల్ నటుడిని బయటకు తీశారు.

ముఖ్యంగా కుటుంబ బంధాలు, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన కథాంశం సాధారణ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడమే రూ.200 కోట్ల గ్రాస్ సాధించడానికి కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిష్ రాజీ లేని నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

​ఇరుముడి ఓటీిటీ

​తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇరుముడి సినిమాను సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నెట్‌ఫ్లిక్స్ నుంచి త్వరలోనే వెలువడనుంది. థియేటర్లలో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్, ఓటీటీ ప్రియులు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలోనూ రికార్డు!

ఇరుముడి సినిమాలో రవితేజ నటనకు తోడుగా బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, రమేష్ ఇందిర, స్వస్తిక విజయ్ తమ పాత్రల్లో జీవించారు. బేబీ నక్షత్ర, రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

క్రాక్, ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో చేరిన ఈ భారీ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోనూ అదే రీతిలో వ్యూయర్ షిప్ రికార్డులను సృష్టిస్తుందనే అంచనాలున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More