Ravi Teja Thulabharam Title Promo Released: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సినిమాతో ఘనవిజయం అందుకున్న మాస్ మహారాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. వైవిధ్యమైన కథనాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడైన దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ క్రేజీ చిత్రానికి 'తులాభారం' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో టైటిల్ డాక్యుమెంటరీ..
సాధారణంగా సినిమాల టైటిళ్లను పోస్టర్ లేదా చిన్న వీడియో ద్వారా ప్రకటిస్తుంటారు. అయితే వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో ఒక ఆసక్తికరంగా 'టైటిల్ డాక్యుమెంటరీ' పేరుతో ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టైటిల్ ఎంపిక వెనుక జరిగిన సరదా చర్చలు, బిహైండ్ ది సీన్స్ సన్నివేశాలతో కూడిన ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
'క్రైమ్ మహారాజా'గా రవితేజ!
ఈ ప్రోమో ద్వారా రవితేజ కెరీర్‌లో 'నవ రవితేజము' అనే సరికొత్త అధ్యాయం మొదలైందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 'మాస్ మహారాజా'గా అభిమానుల గుండెల్లో నిలిచిన రవితేజను ఈ చిత్రం కోసం 'క్రైమ్ మహారాజా' అని పిలుస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
టాప్ యాక్టర్స్‌తో టైటిల్ రివీల్
ఈ తులభారంలో రవితేజతోపాటు గ్లామరస్ బ్యూటీ ప్రియాంక మోహన్, మలయాళ భామ అనస్వర రాజన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటిస్తున్నారు. తులభాలం ది టైటిల్ డాక్యుమెంటరీ ప్రోమోలో వీరంత కలిసి చేసిన కామెడీ తెగ ఆకట్టుకుంటోంది.
బెల్ సౌండ్ మోగగానే లైట్స్ వేయమని వాయిస్ వినిపిస్తుంది. "ఏం చెప్పాలి.. ఏం చెప్పాలి" అని రవితేజ అంటాడు. మిగతా అందరూ సీరియస్‌గా చూస్తారు. "ఇప్పుడు టైటిల్ అంటే మన కథలో రాజకీయం, కుట్ర కుతంత్రాలు ఉన్నాయి కాబట్టి రాజ్ నీతి అని టైటిల్ పెడదాం" అని తరుణ్ భాస్కర్ అంటాడు.
ఇది ఒక లవ్ స్టోరీ
{{/usCountry}}బెల్ సౌండ్ మోగగానే లైట్స్ వేయమని వాయిస్ వినిపిస్తుంది. "ఏం చెప్పాలి.. ఏం చెప్పాలి" అని రవితేజ అంటాడు. మిగతా అందరూ సీరియస్‌గా చూస్తారు. "ఇప్పుడు టైటిల్ అంటే మన కథలో రాజకీయం, కుట్ర కుతంత్రాలు ఉన్నాయి కాబట్టి రాజ్ నీతి అని టైటిల్ పెడదాం" అని తరుణ్ భాస్కర్ అంటాడు.
ఇది ఒక లవ్ స్టోరీ
{{/usCountry}}"బొంగులా ఉంది. ఎక్కడ రాజు ఎక్కడ నీతి. ఇలాంటి టైటిల్ పెడితే జనాలు దొబ్బేయమంటారు. ఇది ఒక లవ్ స్టోరీ. భార్య ప్రేమ కోసం పరితపిస్తున్న భర్త కథ" అని రవితేజ అంటాడు. అలా స్టార్ట్ అయిన చర్చ ఒక్కకొక్కరు వారి క్యారెక్టర్‌కు సంబంధించిన జోనర్‌పై టైటిల్ చెబుతూ వస్తారు.
అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ టైటిల్ పెట్టాలని ప్రియాంక మోహన్ అంటుంది. తూకం అని ముందుగా అంటారు. అది బాలేదని తులభారం అని టైటిల్ రివీల్ చేస్తుంది ప్రియాంక మోహన్. "ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇక మొదలుపెడదామా" అని రవితేజ కన్ఫర్మ్ చేస్తాడు. టైటిల్ రివీల్ చేయగానే వచ్చే బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.
రాజు వచ్చే రవితేజము లలరగ!
"రాజు వచ్చే రవితేజము లలరగ!" అనే పాటను రీమిక్స్ చేసి కొట్టిన బీజీఎమ్ అదిరిపోయింది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ఫుల్ హైప్ ఇచ్చింది. ఇక వీడియో చివరిలో "వీళ్లు లీకైన టైటిల్‌కే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు. రాను రాను ఇంకేంత చేస్తారో" అని రవితేజ తన మార్క్ మ్యానరిజంతో డైలాగ్ చెప్పి నవ్వించాడు.
'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి' చిత్రాలకు అద్భుతమైన స్వరాలు అందించిన వివేక్ సాగర్ ఈ తులభారం సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తేని ఈశ్వర్ (ISC) ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.