Karthik Jayanthi Rayavalasa Release Date Poster: పండుగ వేళ టాలీవుడ్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా అప్‌డేట్ బయటికొచ్చింది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయవలస’.
జోడీగా హీరోయిన్ శ్రీషా నులు

ఈ చిత్రంలో డైరెక్టర్ రాధిక కుమారుడు కార్తీక్ జయంతి హీరోగా చేస్తున్నాడు. అతనికి జోడీగా హీరోయిన్‌గా శ్రీషా నులు నటిస్తోంది. అమెరికా నుంచి కార్తీక్ జయంతి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ‘రాయవలస’తో కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నారు.
యూట్యూబ్‌లో 1 మిలియన్‌కుపైగా వ్యూస్
ఇప్పటి వరకు రాయవలస సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 11న విడుదల
తాజాగా దసరా పండుగ స్పెషల్ అంటూ ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రాయవలస’ మూవీని డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. దసరా సందర్భంగా వదిలిన రాయవలస పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఇంటెన్స్‌తో కూడుకున్న హీరో సీరియస్ లుక్, వెనకాల అమ్మవారు అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఒకే షెడ్యూల్‌లో పూర్తి
గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందింది. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో రాయవలస చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న శ్రీషా నులు, ‘రాణి’ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా అర్జున్ బాల
{{/usCountry}}గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందింది. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో రాయవలస చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న శ్రీషా నులు, ‘రాణి’ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా అర్జున్ బాల
{{/usCountry}}తన సహజమైన నటన, హుందాతనంతో రాణి పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. తొలి చిత్రంతోనే కార్తిక్ జయంతి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోన్నారు. ఈ చిత్రానికి అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు.
పాట పాడిన హీరో
రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి పాటలు పాడటం విశేషం. రాయవలస సినిమాకి వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరామెన్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. డిసెంబర్ 11న రాయవలస మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
రాయవలస నటీనటులు
రాయవలస సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు, సుహాసన్, వివేక్ వర్ధన్, మృదుల, గాంధీ, లక్ష్మణ్, లండన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.