...
...
Next Story

Real Snakes Movies: ఒరిజినల్ పాములతో రిస్క్ చేసిన హీరోహీరోయిన్లు- శ్రీదేవి నుంచి అమితాబ్ దాకా- కానీ, భయపడిన విలన్!

Movies With Real Snakes: సీజీఐ (CGI), విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీతో గ్రాఫిక్స్ తెరకెక్కిస్తున్న ఈ రోజుల్లో జంతువులతో నటించడం సులభమే గానీ, ఒకప్పుడు నిజమైన విషసర్పాలతో షూటింగ్ చేసేవారు. అమితాబ్, శ్రీదేవి, అమీర్ ఖాన్ వంటి అగ్ర నటులు నిజమైన పాములతో నటించి ప్రాణాలకు తెగించిన ఆసక్తికర ఘటనల స్టోరీ మీకోసం.

Published on: Nov 8, 2026, 09:59:36 IST
Advertisement

Movies With Real Snakes Sridevi To Amitabh Bachchan: ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సినీ వెండితెరపై పాము కనబడినా, పులి దాడి చేసినా అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ (VFX), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మాయాజాలమే. పెంపుడు జంతువులను షూటింగ్‌లలో వాడటంపై జంతు సంక్షేమ బోర్డు నిబంధనలు కూడా కఠినంగా మారాయి.

విజువల్ ఎఫెక్ట్స్ అందుబాటులో లేకపోవడం

ఒరిజినల్ పాములతో రిస్క్ చేసిన హీరోహీరోయిన్లు- శ్రీదేవి నుంచి అమితాబ్ దాకా- కానీ, భయపడిన విలన్!
ఒరిజినల్ పాములతో రిస్క్ చేసిన హీరోహీరోయిన్లు- శ్రీదేవి నుంచి అమితాబ్ దాకా- కానీ, భయపడిన విలన్!

1970, 80ల కాలంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. విజువల్ ఎఫెక్ట్స్ అందుబాటులో లేకపోవడంతో దర్శకులు అసలైన పాములు, తేళ్లతోనే సీన్లు చిత్రీకరించేవారు. ఆ సమయంలో నటీనటులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కెమెరా ముందుకు వచ్చేవారు.

శ్రీదేవి సాహసం.. అమ్రీష్ పురీ భయం!

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇచ్చాధారి నాగిని సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 1986లో వచ్చిన 'నగీనా', 1989లో వచ్చిన 'నిగాహేం' చిత్రాల్లో అతిలోక సుందరి శ్రీదేవి, విలక్షణ నటుడు అమ్రీష్ పురీ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాల్లో ఒరిజినల్ విషసర్పాలనే వాడారు. అమ్రీష్ పురీ నాగుపాము ముందు నాగస్వరం ఊదుతుంటే, దానికి అతి దగ్గరగా శ్రీదేవి డాన్స్ చేయాల్సి వచ్చేది. పాము పడగ విప్పిన సీన్లు సహజంగా రావడం కోసం సెట్‌లో పాములు పట్టుకునేవారిని పక్కనే ఉంచి షూటింగ్ పూర్తి చేశారు. అప్పుడు శ్రీదేవి ధైర్యంగా సాహసం చేస్తే విలన్‌గా చేసిన అమ్రీష్ పురి మాత్రం భయంగా షూట్ చేసినట్లు సమాచారం.

అమితాబ్‌కు చెప్పకుండానే విషనాగును వదిలారు!

1971లో తెరకెక్కిన 'రేష్మా ఔర్ షేరా' సినిమా షూటింగ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఒక దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక పాముతో పోరాడే సన్నివేశం ఉంది. షూటింగ్ సమయంలో ఆయనకు ముందుగా చెప్పకుండానే డైరెక్టర్ ఒక నిజమైన విషసర్పాని ఆయన ముందుకు వదిలారు. ఒక్కసారిగా భయపడినప్పటికీ, అమితాబ్ సమయస్ఫూర్తితో ఆ సీన్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

జూహీ చావ్లాను భయపెట్టిన అమీర్ ఖాన్!

నిజమైన పాములను చేతితో పట్టుకోవడం నేర్చుకున్నారు అమీర్ ఖాన్. షూటింగ్ గ్యాప్‌లో అమీర్ ఖాన్ నిజమైన పామును చేతిలో పట్టుకుని తన హీరోయిన్ జూహీ చావ్లా వెనకాల పడేవారని, దాంతో ఆమె భయంతో కేకలు వేస్తూ సెట్టంతా పరుగెత్తేదని జూహీ ఒక ఇంటర్వ్యూలో సరదాగా గుర్తుచేసుకున్నారు.

సెట్‌లో వందలాది నాగుపాములు: 'దూధ్ కా కర్జ్'

జాకీ ష్రాఫ్, నీలం, అరుణా ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన 'దూధ్ కా కర్జ్' చిత్రం క్లైమాక్స్ సన్నివేశం అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమాలో క్లైమాక్స్ కోసమని ఒకట్రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో నిజమైన నాగుపాములను సెట్‌లోకి వదిలారు.

పాముకు, ముంగిసకు మధ్య జరిగే పోరాట సన్నివేశాన్ని కూడా ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా నేరుగా కెమెరాలోనే బంధించారు. 1976 నాటి 'నాగిన్' చిత్రంలో సునీల్ దత్, జితేంద్ర వంటి అగ్ర నటులు ప్రాణభయంతోనే పాముల మధ్య నటించామని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియెన్స్

సాంకేతికత పెరిగిన నేటి కాలంలో అలాంటి ప్రమాదకర షూటింగ్‌లు లేకపోయినా, అప్పట్లో వెండితెరపై ఆ దృశ్యాలు తెచ్చిన గూస్‌బంప్స్ అనుభూతి మాత్రం అద్భుతమనే చెప్పాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks