Prabhas New Look: రెబల్ స్టార్ ప్రభాస్ బయట కనిపించడం చాలా అరుదు. అలాంటిది ఆయన కొత్త ఫొటో ఏదైనా బయటకు వచ్చిందంటే చాలు, క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. తాజాగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రభాస్‌ను కలిసిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రభాస్ లుక్

సినీ ప్రియుల దృష్టంతా ప్రభాస్ లేటెస్ట్ లుక్ మీదే నిలిచిపోయింది. ఎంతో స్టైలిష్‌గా, యంగ్ అండ్ ఫ్రెష్ లుక్‌లో కనిపించిన డార్లింగ్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా ఈ ఫొటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.
ఫౌజీ లేదా స్పిరిట్?
ప్రభాస్ లేటెస్ట్ అప్పియరెన్స్ చూసిన అభిమానుల్లో ఇప్పుడు ఒకే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన ఇంతటి పర్ఫెక్ట్ లుక్‌లో కనిపించడం హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘స్పిరిట్’ చిత్రం కూడా ప్రభాస్ లైనప్‌లో ఉంది. యాదృచ్ఛికంగా ‘స్పిరిట్’ కథ కూడా డ్రగ్స్ మాఫియాపై పోరాడే ఓ మాజీ పోలీస్ అధికారి నేపథ్యంలో సాగుతుండగా, ఇప్పుడు ప్రభాస్ నిజ జీవితంలోనూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలపడం విశేషంగా మారింది.
కిషన్ రెడ్డి భేటీ
దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘నషా ముక్త్ భారత్’ ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా, హైదరాబాద్ వేదికగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ యాత్ర జరగనున్నాయి.
{{/usCountry}}దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘నషా ముక్త్ భారత్’ ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా, హైదరాబాద్ వేదికగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ యాత్ర జరగనున్నాయి.
{{/usCountry}}ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం (నవంబర్ 22) స్వయంగా ప్రభాస్ నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ‘నషా ముక్త్ భారత్’ పోస్టర్‌తో పాటు, డ్రగ్స్ రహిత భారత్ కోసం మనమందరం గొంతు విప్పుదాం అనే నినాదంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు.
ప్రభాస్ సపోర్ట్
మత్తు పదార్థాల మహమ్మారి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తోందని, దీనిని తరిమికొట్టడం కేవలం ప్రభుత్వాల చర్యలతోనే సాధ్యం కాదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కోట్లాది మంది అభిమానులను, యువతను ప్రభావితం చేయగల అపారమైన శక్తి ప్రభాస్‌కు ఉందని, ఆయన ఒక్క పిలుపునిస్తే యువతలో గొప్ప చైతన్యం వస్తుందని కేంద్రమంత్రి కొనియాడారు.
సామాజిక బాధ్యత కలిగిన నటుడిగా ప్రభాస్ కూడా ఈ మహా ఉద్యమానికి వెంటనే సానుకూలంగా స్పందించి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.