...
...
Next Story

Regina Cassandra: ప్రేమించినోడే వెన్నుపోటు పొడిచాడు, లాక్‌డౌన్ వరంగా మారింది.. హీరోయిన్ రెజీనా కసాండ్రా కామెంట్స్

Regina Cassandra About Heartbreak Betrayal: తన ప్రేమ వ్యవహారం, అందులో ఎదురైన ద్రోహం గురించి నటి రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో ప్రేమలో మోసపోయి తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడాల్సి వచ్చిందని మహాశక్తి ఇంటర్వ్యూలో బహిరంగంగా పంచుకున్నారు.

Published on: Nov 6, 2026, 12:40:03 IST
Advertisement

Regina Cassandra About Heartbreak And Betrayal: తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. తాజాగా రెజీనా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

గ్లామరస్ పాత్రలతో విభిన్నమైన కథలు

ప్రేమించినోడే వెన్నుపోటు పొడిచాడు, లాక్‌డౌన్ వరంగా మారింది.. హీరోయిన్ రెజీనా కసాండ్రా కామెంట్స్
ప్రేమించినోడే వెన్నుపోటు పొడిచాడు, లాక్‌డౌన్ వరంగా మారింది.. హీరోయిన్ రెజీనా కసాండ్రా కామెంట్స్

గ్లామరస్ పాత్రలతో పాటు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు. ప్రేమ పేరిట జరిగిన మోసం, దానివల్ల అనుభవించిన నరకాన్ని గుండెవిప్పి చెప్పారు.

2020లో ఎదురైన ద్రోహం – ముక్కలైన గుండె

తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల గురించి రెజీనా మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "2020లో నా ప్రేమ బంధం ముగిసింది. ఆ బంధంలో నేను దారుణంగా మోసపోయాను. నమ్మిన మనిషే వెన్నుపోటు పొడవడంతో మనసంతా ముక్కలైపోయింది" అని రెజీనా చెప్పారు. ఆ మోసం నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని, ఆ సమయంలో మాటల్లో చెప్పలేని మానసిక వేదనను అనుభవించానని రెజీనా కాసాండ్రా తెలిపారు.

లాక్‌డౌన్ సమయమే నన్ను కాపాడింది

ప్రేమలో మోసపోయిన తర్వాత మళ్లీ కొంతకాలం పాటు ఏ రకమైన బంధంలోకీ వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు రెజీనా వివరించారు. "నా సమయాన్ని, నా ఆలోచనలను నాకోసమే కేటాయించుకోవాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ మొదలైంది. ఆ సమయం నాకు ఒక విధంగా వరంగా మారింది. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ, నన్ను నేను ప్రేమించుకోవడం (Self-love) నేర్చుకున్నాను. ఆ రోజుల్లో నాకు నేను ఇచ్చుకున్న ధైర్యమే ఈ రోజు నన్ను ఈ స్థాయి ప్రశాంతతకు చేర్చింది" అని రెజీనా వెల్లడించారు.

కెరీర్‌లో జోరు పెంచిన భామ

ప్రస్తుతం తమిళంలో నయనతార 'మూక్కుత్తి అమ్మన్ 2' (తెలుగులో మహాశక్తి) చిత్రంలో కూడా రెజీనా కాసాండ్రా విలన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్న 'ది వైవ్స్' అనే ప్రతిష్టాత్మక చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

రెజీనా కసాండ్రాపై ప్రశంసలు

అయితే, రెజీనా కాసాండ్రా ప్రేమించిన వ్యక్తి అనేది ఆమె చెప్పకపోయినప్పటికీ ఆ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎదురైన దెబ్బకు కుంగిపోకుండా, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌పై దృష్టి సారించి ముందుకు సాగుతుండటంపై అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నటి రెజీనా కాసాండ్రా తన ప్రేమ విఫలం గురించి ఏమి చెప్పారు?

2020లో తాను ప్రేమించిన వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయానని, ఆ ద్రోహం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని రెజీనా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

2. మోసం నుంచి బయటపడటానికి రెజీనా ఏం చేశారు?

కొంతకాలం ప్రేమ బంధాలకు దూరంగా ఉంటూ, లాక్‌డౌన్ సమయంలో తనపై తాను దృష్టి పెట్టి, సెల్ఫ్-లవ్ (స్వయం ప్రేమ) ద్వారా మానసిక ప్రశాంతత సాధించినట్లు ఆమె చెప్పారు.

3. ప్రస్తుతం రెజీనా నటిస్తున్న కొత్త సినిమాలు ఏవి?

ప్రస్తుతం ఆమె తమిళంలో 'మూక్కుత్తి అమ్మన్ 2' సినిమాలోనూ, బాలీవుడ్‌లో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ది వైవ్స్' చిత్రంలోనూ నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks