...
...
Next Story

Renu Desai Dhurandhar 2: మోదీకి 'అంధ భక్తురాలిని'.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. ధురంధర్ 2 రివ్యూ వైరల్

Renu Desai Dhurandhar 2: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సంచలన పోస్టు పెట్టింది. పీఎం మోడీకి తాను అంధభక్తురాలినని ప్రకటించిన రేణు దేశాయ్.. ధురంధర్ 2 సినిమాపై రివ్యూను పంచుకుంది.

Published on: Mar 22, 2026, 13:46:18 IST
Advertisement

ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' సినిమాపై ఆమె తన రివ్యూను పంచుకుంది. ఈ క్రమంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 చిత్రంపై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

రేణు దేశాయ్ రివ్యూ

ధురంధర్ 2పై రేణు దేశాయ్ రివ్యూ
ధురంధర్ 2పై రేణు దేశాయ్ రివ్యూ

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2పై రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించింది. ఆమె రివ్యూ తెగ వైరల్ గా మారింది. సాయుధ దళాలు, నిఘా సంస్థల త్యాగాల వల్లే మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉన్నామని ఆమె పేర్కొంది. మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వారు ధురంధర్ 1, 2 సినిమాలను తప్పక చూడాలని ఆమె ఘాటుగా సూచించింది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో

‘‘ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తూ, దేశం గురించి అనవసరమైన చెత్త మాట్లాడుతున్నారు. సాయుధ దళాలు, నిఘా సంస్థల కారణంగా మన ప్రశాంతంగా ఉన్నాం. వాళ్ల మీద కొంచెం గౌరవం ఉన్నా ధురంధర్ 1, 2 సినిమాలు చూడండి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రేణు దేశాయ్ రాసుకొచ్చింది.

భగవద్గీత శ్లోకంతో

ఈ సందర్భంగా భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకాన్ని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నీ కర్తవ్యం ధర్మాన్ని నిలబెట్టడమే, ప్రతిఫలాన్ని ఆశించడం కాదు" అనే సందేశాన్ని ఆమె హైలైట్ చేసింది. యుద్ధభూమి పిలుస్తోందని, దేశ రక్షణ చర్యలో నిర్దాక్షిణ్యంగా ఉండాలని శ్లోకం ద్వారా వివరించింది.

రేణు దేశాయ్ ఇన్ స్టా స్టోరీ

అంధ భక్తురాలు

ప్రధాని మోదీ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని ఆమె బహిరంగంగానే చాటుకుంది. "నేను బీజేపీకి, మన అద్భుతమైన ప్రధాని మోదీజీకి గర్వించదగిన అంధ భక్తురాలిని" అని రేణు దేశాయ్ రాసుకొచ్చింది.

ధురంధర్ 2 సునామీ

'ధురంధర్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటేసింది. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks