మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ తో, గ్యాంగ్ స్టర్ మర్డర్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమానే రివాల్వర్ రీటా.
రివాల్వర్ రీటా ఓటీటీ

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కిన ఈ రివాల్వర్ రీటా సినిమా ఓటీటీలో తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలై కొద్ది వారాలకే ఓటీటీలోకి వస్తున్న అతి కొద్ది కొత్త తమిళ సినిమాలలో ఇది ఒకటి.
థియేటర్ రెస్పాన్స్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రివాల్వర్ రీటా నవంబర్ 28న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు. స్టోరీ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టిందనే కామెంట్లు వినిపించాయి. ఈ సినిమాకు జేకే చంద్రు డైరెక్టర్. ఈ సినిమాలో కీర్తి సురేష్, రాధిక శరత్ కుమార్, సునీల్, సెండ్రయాన్ తదితరులు నటించారు.
ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం రివాల్వర్ రీటా బాక్సాఫీస్ వద్ద రూ. 4.76 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీని నెట్ వసూళ్లు రూ. 3.99 కోట్లుగా ఉన్నాయి. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎప్పటికైనా మూల్యం చెల్లించాల్సిందేనన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.
రివాల్వర్ రీటా కథ
రీటా (కీర్తి సురేష్), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్) ఓ ఇంట్లో ఉంటారు. మరోవైపు పాండిచ్చేరిలో క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్). డ్రాకులా చేతిలో నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) బ్రదర్ హత్యకు గురవుతాడు. దీంతో డ్రాకులాను చంపాలని ఓ గ్యాంగ్ కు రూ.5 కోట్లతో డీల్ సెట్ చేస్తాడు నర్సింహారెడ్డి.
{{/usCountry}}రీటా (కీర్తి సురేష్), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్) ఓ ఇంట్లో ఉంటారు. మరోవైపు పాండిచ్చేరిలో క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్). డ్రాకులా చేతిలో నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) బ్రదర్ హత్యకు గురవుతాడు. దీంతో డ్రాకులాను చంపాలని ఓ గ్యాంగ్ కు రూ.5 కోట్లతో డీల్ సెట్ చేస్తాడు నర్సింహారెడ్డి.
{{/usCountry}}కానీ ఓ రోజు డ్రాకులా పాండ్యన్ డ్రగ్స్ మత్తులో పొరపాటున వేరే ఇంటికి వెళ్లబోయి రీటా ఇంటికి వెళ్తాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రీటా తల్లి కొట్టడంతో పాండ్యన్ చనిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? డ్రాకులా కొడుకు బాబీ పాండ్యన్ (సునీల్) తన తండ్రిని చంపిన వాళ్లను కనిపెట్టాడా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.