...
...
Next Story

RGV Lenin Review: నాగార్జున మీద ఒట్టు.. అక్కినేని ఫ్యామిలీలో అఖిలే బెస్ట్ యాక్టర్: రామ్ గోపాల్ వర్మ లెనిన్ రివ్యూ

RGV Lenin Review: యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగార్జున మీద ఒట్టు వేస్తు మరీ వర్మ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ తో మూవీకి మైలేజ్ వస్తుందా? చూసేయండి.

Published on: Jul 12, 2026, 20:34:45 IST
Advertisement

RGV Lenin Review: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్, డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లెనిన్’ (Lenin) చిత్రానికి ఊహించని రేంజ్‌లో సెలబ్రిటీ సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ఏ సినిమానైనా, ఏ నటుడినైనా అంత సులభంగా మెచ్చుకోని కల్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. అఖిల్ నటనకు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్నాయి.

నాగార్జునపై ఒట్టేసిన వర్మ

నాగార్జున మీద ఒట్టు.. అక్కినేని ఫ్యామిలీలో అఖిలే బెస్ట్ యాక్టర్: రామ్ గోపాల్ వర్మ లెనిన్ రివ్యూ (x)
నాగార్జున మీద ఒట్టు.. అక్కినేని ఫ్యామిలీలో అఖిలే బెస్ట్ యాక్టర్: రామ్ గోపాల్ వర్మ లెనిన్ రివ్యూ (x)

లెనిన్ సినిమా చూసిన వెంటనే ఆర్జీవీ ఎక్స్‌లో నేరుగా అఖిల్‌ను ట్యాగ్ చేస్తూ ఒక పవర్‌ఫుల్ నోట్ రాశాడు. " అఖిల్.. నేను ఇప్పుడే ‘లెనిన్’ సినిమా చూశా. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇది పక్కన పెడితే, అక్కినేని ఫ్యామిలీ మొత్తంలోనూ నువ్వే బెస్ట్ యాక్టర్‌వి అని నాకు అర్థమైంది. ఈ విషయాన్ని నేను నాగార్జున మీద ఒట్టు వేసి మరీ చెప్తున్నా" అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

ఎమోషనల్ సీన్స్‌లో పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్

అఖిల్‌లోని అసలైన పవర్‌ను బయటకు తీయడానికి దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి సిద్ధం చేసిన వైవిధ్యమైన క్యారెక్టరైజేషనే దీనికి ప్రధాన కారణమన్నాడు.

అఖిల్ నటనలో మార్పు

‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ మార్కెట్ వాల్యూ, స్క్రీన్ ఇమేజ్‌పై ట్రేడ్ వర్గాల్లో ఎన్నో అప నమ్మకాలు వ్యక్తమయ్యాయి. కానీ ‘లెనిన్’ చిత్రంతో అఖిల్ తన యాక్టింగ్ మెథడాలజీని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కేవలం భారీ యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాకుండా, మురళి కిషోర్ రాసిన ఇంటెన్స్ ఎమోషనల్ అండ్ ఐడియాలజికల్ సీన్స్‌లో అఖిల్ చూపించిన మెచ్యూరిటీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.

మైలేజ్ ఇస్తుందా?

ల్యాండ్‌మార్క్ క్లాసిక్ ‘శివ’ చిత్రంతో నాగార్జున కెరీర్‌ను మార్చిన వర్మ.. ఇప్పుడు అదే నాగార్జునపై ఒట్టేసి అఖిల్‌ను ప్రశంసించడం అంటే, లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ పుల్ చేసే అవకాశాలు 40% పెరిగినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లెజెండరీ నటుడు ఏఎన్నార్, కింగ్ నాగార్జున, యువ హీరో నాగచైతన్య ఉన్న అక్కినేని వంశంలో.. అందరికంటే అఖిల్ గొప్పగా నటించాడంటూ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks