...
...
Next Story

Rihanna Ambani Gift: అంబానీలు ఇచ్చిన డైమండ్ బ్రాస్‌లెట్ తో రిహానా.. వామ్మో అన్ని కోట్లా?.. గిఫ్ట్ వెనుక అసలు కథ ఇదే

Rihanna Ambani Gift: గ్లోబల్ పాప్ స్టార్ రిహానాకు భారత కుబేరుడు ముఖేష్ అంబానీ కుటుంబం ఓ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యంత ఖరీదైన బ్రాస్‌లెట్ ఆమె చేతికి ఎలా వచ్చింది? దాని రేట్, ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం.

Published on: Jun 17, 2026, 08:52:20 IST
Advertisement

Rihanna Ambani Gift: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ పాప్ సూపర్‌స్టార్ రిహానా (Rihanna) మరోసారి ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఈ సారి తన వద్ద ఉన్న అత్యంత విలువైన డైమండ్ కలెక్షన్‌ను అభిమానులతో పంచుకుంది. అందులో ముఖ్యంగా ముఖేష్ అంబానీ కుటుంబం ఇచ్చిన డైమండ్ బ్రాస్‌లెట్ స్టోరీ వైరల్ గా మారింది.

వైరల్ వీడియో

అంబానీలు ఇచ్చిన డైమండ్ బ్రాస్‌లెట్ తో రిహానా.. వామ్మో అన్ని కోట్లా?
అంబానీలు ఇచ్చిన డైమండ్ బ్రాస్‌లెట్ తో రిహానా.. వామ్మో అన్ని కోట్లా?

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ వీడియోలో.. రిహానా తన డబుల్-డెనిమ్ లుక్‌ను ఎంతో సరదాగా వివరిస్తూ కనిపించింది. ఎలాంటి గ్లామ్ టీమ్ (మేకప్ ఆర్టిస్టులు) సాయం తీసుకోకుండా తన సొంత బ్రాండ్ ‘ఫెంటీ బ్యూటీ’ ఉత్పత్తులను ఉపయోగించి స్వయంగా రెడీ అయినట్లు ఆమె వెల్లడించింది.

రిహానా డైమండ్ బ్రాస్‌లెట్

ఈ వీడియోలోనే తన చేతి మణికట్టును కెమెరా వైపు తిప్పిన రిహానా.. ధగధగలాడుతున్న ఒక వజ్రాల టెన్నిస్ బ్రాస్‌లెట్‌ను చూపించింది. "ఇది నాకు ఇండియాలో అంబానీ ఫ్యామిలీ బహుమతిగా ఇచ్చింది" అని ఆమె ఎంతో ఆనందంగా చెప్పింది.

రేట్ ఎంతంటే?

నగల డిజైన్లలో టెన్నిస్ బ్రాస్‌లెట్ అనేది అత్యంత ఐకానిక్. ఇది ఎంతో సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండటమే కాకుండా ఎప్పటికీ తన అందాన్ని కోల్పోని వింటేజ్ లుక్‌ను కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

ఇదే అసలు స్టోరీ

ఈ అద్భుతమైన వజ్రాల బ్రాస్‌లెట్ వెనుక అంబానీల రాయల్టీకి సంబంధించిన ఒక కథ ఉంది. 2024 మార్చిలో జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో రిహానా ఇచ్చిన లైవ్ పర్ఫార్మెన్స్ గ్లోబల్ రేంజ్‌లో సంచలనం సృష్టించింది.

ఆ వేదికపై ఆమె తన సూపర్ హిట్ సాంగ్స్ అయిన 'వర్క్', 'వైల్డ్ థాట్స్', 'బర్త్‌డే కేక్' వంటి పాటలతో వేడుకకు వచ్చిన అతిథులను రిహానా ఉర్రూతలూగించింది. ఆ పర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత అంబానీ కుటుంబ సభ్యులంతా స్టేజ్ పైకి వచ్చి ఆమెను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. రిహానా ఆ పర్ఫార్మెన్స్ కోసం తీసుకున్న భారీ రెమ్యూనరేషన్‌కు అదనంగా.. తమ కుటుంబంపై ఆమె చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా అంబానీలు ఈ అరుదైన డైమండ్ టెన్నిస్ బ్రాస్‌లెట్‌ను కానుకగా అందజేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks