Risk Movie Trailer Launch Hero Sandeep Ashwa Comments: సంపంగి, 16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రిస్క్'. ఈ సినిమాలో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన రిస్క్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రిస్క్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

జూన్ రెండో వారంలో రిస్క్ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా రిస్క్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, హీరో సందీప్ అశ్వ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
యువతకు బాగా నచ్చే సినిమా
రిస్క్ ట్రైలర్ లాంచ్‌లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు" అని అన్నారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి కామెంట్స్
"రిస్క్ ట్రైలర్‌లోని విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఉత్కంఠగా అనిపించింది. ఇంకా చూడాలనిపించింది. ఇంత ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి, నటీనటులకు, నిర్మాతలకు అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలిపారు.
దాదాపు పదేళ్లు పట్టింది
హీరో సందీప్ అశ్వ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను" అని అన్నారు.
లవ్, ఎమోషన్, యాక్షన్ అన్ని
"మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘రిస్క్’ సినిమా జర్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. అహర్నిశలు కష్టపడి ఈ సినిమా చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఇందులో ఉంటాయి" అని సందీప్ అశ్వ పేర్కొన్నారు.
సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా
{{/usCountry}}"మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘రిస్క్’ సినిమా జర్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. అహర్నిశలు కష్టపడి ఈ సినిమా చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఇందులో ఉంటాయి" అని సందీప్ అశ్వ పేర్కొన్నారు.
సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా
{{/usCountry}}"ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, కామెడీ, లవ్ ఉంటే.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటన కనబరిచారు. రాజీవ్ కనకాల గారు, దువ్వాసి మోహన్ గారు, అనీష్ కురువిల్లా గారు, కాదంబరి కిరణ్ గారు వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అని తెలిపారు హీరో సందీప్ అశ్వ.
పాటలతోనే కథ చెప్పారు
"మా డీవోపీ జగదీష్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులోని పాటలన్నీ ఎంతో మంచి క్వాలిటీతో ఉంటాయి. ఘంటాడి కృష్ణ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన పాటలతోనే కథ చెప్పారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాను జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది" అని రిస్క్ మూవీ హీరో సందీప్ అశ్వ చెప్పుకొచ్చారు.