Risk: వెండితెరపై చూసుకోడానికి పదేళ్లు పట్టింది, పాటలతోనే కథ చెప్పారు- రిస్క్ ట్రైలర్ లాంచ్- హీరో సందీప్ అశ్వ కామెంట్స్
Sandeep Ashwa Comments In Risk Movie Trailer Launch: మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ దర్శకుడిగా మారిన లేటెస్ట్ మూవీ రిస్క్. తాజాగా రిస్క్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రిస్క్ ట్రైలర్ లాంచ్‌లో హీరో సందీప్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Risk Movie Trailer Launch Hero Sandeep Ashwa Comments: సంపంగి, 16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రిస్క్'. ఈ సినిమాలో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన రిస్క్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

రిస్క్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
జూన్ రెండో వారంలో రిస్క్ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా రిస్క్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, హీరో సందీప్ అశ్వ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
యువతకు బాగా నచ్చే సినిమా
రిస్క్ ట్రైలర్ లాంచ్‌లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు" అని అన్నారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి కామెంట్స్
"రిస్క్ ట్రైలర్‌లోని విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఉత్కంఠగా అనిపించింది. ఇంకా చూడాలనిపించింది. ఇంత ఉత్కంఠభరితంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి, నటీనటులకు, నిర్మాతలకు అభినందనలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలిపారు.
దాదాపు పదేళ్లు పట్టింది
హీరో సందీప్ అశ్వ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. దీన్నే నా తొలి విజయంగా భావిస్తున్నాను" అని అన్నారు.
లవ్, ఎమోషన్, యాక్షన్ అన్ని
"మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘రిస్క్’ సినిమా జర్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. అహర్నిశలు కష్టపడి ఈ సినిమా చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఇందులో ఉంటాయి" అని సందీప్ అశ్వ పేర్కొన్నారు.
సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా
"ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, కామెడీ, లవ్ ఉంటే.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటన కనబరిచారు. రాజీవ్ కనకాల గారు, దువ్వాసి మోహన్ గారు, అనీష్ కురువిల్లా గారు, కాదంబరి కిరణ్ గారు వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అని తెలిపారు హీరో సందీప్ అశ్వ.
పాటలతోనే కథ చెప్పారు
"మా డీవోపీ జగదీష్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులోని పాటలన్నీ ఎంతో మంచి క్వాలిటీతో ఉంటాయి. ఘంటాడి కృష్ణ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన పాటలతోనే కథ చెప్పారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాను జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది" అని రిస్క్ మూవీ హీరో సందీప్ అశ్వ చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


