...
...
Next Story

Riteish Deshmukh: రాజా శివాజీ సక్సెస్.. దయచేసి అలా చేయొద్దంటూ ప్రేక్షకులకు రితేష్ దేశ్‌ముఖ్ రిక్వెస్ట్.. వీడియో వైరల్

Riteish Deshmukh: ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే, థియేటర్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ కోరాడు.

Published on: May 2, 2026, 20:23:16 IST
Advertisement

Riteish Deshmukh: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం మే 1న థియేటర్లలో విడుదలై అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో ఆయన సినిమాకు సంబంధించి ఒక రిక్వెస్ట్ కూడా చేశాడు.

రితేష్ రిక్వెస్ట్

రితేష్ దేశ్‌ముఖ్
రితేష్ దేశ్‌ముఖ్

రాజా శివాజీ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రితేష్ దేశ్‌ముఖ్.. ఆడియన్స్ ను ఓ రిక్వెస్ట్ చేశాడు. ఎవరూ థియేటర్లలోని దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కోరాడు. ఈ మేరకు రితేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేకంగా ఒక వీడియోను పంచుకున్నాడు.

వీడియో పోస్ట్

"నమస్కారం! ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఆధారంగా 'రాజా శివాజీ' చిత్రాన్ని మేము విడుదల చేశాం. మీరు ఈ సినిమాను స్వయంగా వీక్షించి అద్భుతమైన స్పందనను అందించారు. ఈ సందర్భంగా 'రాజా శివాజీ' బృందం తరఫున, నా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని రితేష్ పేర్కొన్నాడు.

దయచేసి అలా చేయొద్దు

"నాకు మీపై పూర్తి గౌరవం ఉంది. చాలామంది ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుని వీడియోలు రికార్డు చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరూ ఇలాంటి వీడియోలను అప్‌లోడ్ చేయవద్దు" అని రితేష్ కోరాడు. దీనికి సంబంధించిన క్యాప్షన్‌ను కూడా మరాఠీలో రాస్తూ.. "ఒక అభ్యర్థన.. దయచేసి సినిమా చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్ చేయకండి" అని రితేష్ విజ్ఞప్తి చేశాడు.

సల్మాన్ ఖాన్ క్యామియో

'రాజా శివాజీ' చిత్రంలో భారీ తారాగణం నటించింది. ఇందులో అభిషేక్ బచ్చన్, జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు.

థియేటర్లలో సల్మాన్ ఖాన్ ఎంట్రీకి అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ద్వారా రితేష్, జెనీలియా దంపతుల కుమారుడు రహిల్ దేశ్‌ముఖ్ నటుడిగా పరిచయమవడం విశేషం. మొత్తానికి డైరెక్టర్ గా, నటుడిగా రితేష్ ఈ రాజా శివాజీ మూవీతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks