Ritika Nayak: ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ముద్దుగుమ్మ రితికా నాయక్ హ్యాట్రిక్ జోష్ లో ఉంది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రితికా, తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, మొబైల్ సీక్రెట్స్, సౌత్ కొరియన్ మ్యూజిక్ సెన్సేషన్ బిటిఎస్ (BTS) బ్యాండ్ స్టార్ 'సుగా' (SUGA) పై తనకున్న అమితమైన అభిమానాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.
సుగా నా ఫేవరెట్

ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో యాంకర్ రితికా నాయక్ ను.. "మీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఎవరి ఫోటో ఉంది?" అని ప్రశ్నించారు. దానికి రితికా ఏమాత్రం తడుముకోకుండా తన స్మార్ట్‌ఫోన్ తీసి స్క్రీన్ చూపించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధ సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బిటిఎస్ (BTS - Bangtan Sonyeondan) ఫోటో ఉంది.
బిటిఎస్ సభ్యులలో మీకు ఎవరంటే ఇష్టమంటే.. వెంటనే సుగా పేరు చెప్పేసింది రితికా నాయక్.
చూస్తూ ఉండిపోతా
"ఒకవేళ సుగాను నేరుగా కలిసే అవకాశం వస్తే నేను ఏమీ మాట్లాడలేను. అలా అతని వైపే చూస్తూ ఉండిపోతాను. 'హాయ్.. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ' అని మాత్రమే చెప్పగలనేమో" అని తన క్రష్ గురించి నవ్వుతూ చెప్పుకొచ్చింది రితికా.
ఆ బాధ
బిటిఎస్ వరల్డ్ టూర్ లిస్టులో ఇండియా లేకపోవడం తనను ఎంతో బాధించిందని రితికా నాయక్ వెల్లడించింది. అయితే భవిష్యత్తులో తప్పకుండా వారు భారతదేశానికి వచ్చి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.
క్రేజీ కనెక్షన్
యాదృచ్ఛికంగా రితికా నాయక్ ఇటీవల నటించిన సినిమా పేరు 'కొరియన్ కనకరాజు' కావడం, రియల్ లైఫ్‌లో కూడా ఆమెకు కొరియన్ పాప్ కల్చర్, బిటిఎస్ మ్యూజిక్ అంటే అమితమైన ఇష్టం ఉండటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను (BTS ARMY) కలిగి ఉన్న ఈ 7-సభ్యుల గ్రూప్ (ఆర్ఎమ్, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్‌కూక్) కు భారతదేశంలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా తాను బిటిఎస్ ఆర్మీలో ఒకరినని బహిరంగంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను (BTS ARMY) కలిగి ఉన్న ఈ 7-సభ్యుల గ్రూప్ (ఆర్ఎమ్, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్‌కూక్) కు భారతదేశంలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా తాను బిటిఎస్ ఆర్మీలో ఒకరినని బహిరంగంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
{{/usCountry}}టాలీవుడ్‌లో రితికా నాయక్ జోరు
2022లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రితికా నాయక్, తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మిరాయ్’ (Mirai) సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పి బిగ్ బ్రేక్ అందించింది.
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ, ఇటీవల టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) చిత్రంలో కథానాయికగా అలరించింది. ఆగస్టు 7న విడుదలైన ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకోవడంతో రితికా గోల్డెన్ లెగ్ గా మారింది.