యష్ నటించిన టాక్సిక్ చిత్రం జూన్ 4వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ సడెన్‌గా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది కేవలం సినిమా విడుదలలో పలు కారణాలతో జాప్యం మాత్రమేనని జనాలు అనుకున్నప్పటికీ లోతుగా ఆలోచిస్తే మరో విషయం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 4, 2026 నాటి ముహూర్తం, కచ్చితమైన పంచాంగ సమాచారాన్ని పరిశీలిస్తే అసలు కథ వేరేలా ఉందని అంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాన్ని ఎంత బలంగా నమ్ముతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా సమయానికి సంబంధించిన ఒక చిన్న పొరపాటు కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుందని పదేపదే వినిపిస్తూనే ఉంది. ఒకవేళ అందుకే రాకింగ్ స్టార్ యష్ కేవలం విడుదల తేదీని మార్చడమే కాకుండా.. తన సినిమా భవిష్యత్ కూడా సరిగా ఉండాలని అనుకున్నాడని జ్యోతిష్య నిపుణలు చెబుతున్నారు. ఇది సమయస్ఫూర్తి అంటున్నారు.
జూన్ 4, 2026 నాటి పంచాంగ సమాచారం ప్రకారం యష్ తీసుకున్న నిర్ణయం ఒక అద్భుతమైన ఎత్తుగడ అని వెల్లడిస్తుంది. ఆ రోజు రాత్రి 11:33 గంటల వరకు, కృష్ణ పక్ష చతుర్థి (చీకటి పక్షంలోని నాల్గవ రోజు) ప్రభావం ప్రబలంగా ఉంది. ముహూర్తం ప్రకారం దీనిని రిక్త తిథగా పరిగణిస్తారు. అంటే ఇది ప్రయత్నాలను నిష్ఫలం చేసే లేదా వాటిని ఆచరణ సాధ్యం కానివిగా చేసే సమయం.
విజయానికి ప్రతీక అయిన ఉత్తరాషాఢ నక్షత్రం ఆ రోజును సూచించినప్పటికీ.. ఒక ప్రతికూల గ్రహస్థితి దాని శుభాన్ని అస్థిరతగా మార్చింది. మధ్యాహ్నం 2:03 నుండి 3:47 గంటల వరకు రాహుకాలం ఏర్పడటం, దానికి తోడు అశుభ ముహూర్తాలు ఆ రోజులోని అత్యంత ముఖ్యమైన ప్రైమ్ షో స్లాట్ శక్తిని దెబ్బతీస్తాయి.
కోట్ల రూపాయల పెట్టుబడులు, దీర్ఘకాలిక విజయం కోసం రిక్త తిథి, రాహుకాలం సంఘర్షణను నివారించడం వివేకం అని గ్రంథాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. టాక్సిక్ విడుదల కూడా వాయిదా వేయడం చాలా మంచి పని నిపుణులు చెబుతున్నారు.
యష్ ఏమన్నాడంటే?
{{/usCountry}}కోట్ల రూపాయల పెట్టుబడులు, దీర్ఘకాలిక విజయం కోసం రిక్త తిథి, రాహుకాలం సంఘర్షణను నివారించడం వివేకం అని గ్రంథాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. టాక్సిక్ విడుదల కూడా వాయిదా వేయడం చాలా మంచి పని నిపుణులు చెబుతున్నారు.
యష్ ఏమన్నాడంటే?
{{/usCountry}}మరోవైపు టాక్సిక్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ హీరో యష్ స్వయంగా స్పందించాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, అయితే ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ (అంతర్జాతీయ పంపిణీ), వ్యూహాత్మక భాగస్వామ్యాలపై తాము దృష్టి సారించినట్లు అతను చెప్పాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యష్ పేర్కొన్నాడు.
"ప్రస్తుతం భారతీయ సినిమా గ్లోబల్ స్టేజ్‌పై తనదైన ముద్ర వేస్తోంది. ఇలాంటి సమయంలో స్థాయిని పెంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా ఆ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. కొన్ని కథలకు కాస్త ఓపిక అవసరం. భారతీయ సినిమా గర్వించేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తాను" అని యష్ అభిమానులకు హామీ ఇచ్చాడు.
టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups) మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ పై కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బుధవారం (ఏప్రిల్ 29) అధికారిక ప్రకటన రిలీజ్ చేశాయి. నిజానికి ఈ చిత్రం ఫస్ట్ మార్చి 19న విడుదల కావాల్సింది.
ఆ సమయంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చేది. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లో ఏర్పడిన ఆటంకాల వల్ల టాక్సిక్ మూవీ రిలీజ్ ను జూన్ 4కి మార్చారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు.